ప్రతికూల వాతావరణంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
శంషాబాద్: ప్రతికూల వాతావరణంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చెన్నై,ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఢిల్లీ నుంచి హైదరాబాద్, అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానాలు కూడా కొన్ని గంటల ఆలస్యంగా రానున్నాయి. అటు ఢిల్లీలోనూ పొగ మంచు కారణంగా భారీ సంఖ్యలో విమానరాకపోకలకు ఆటంకం కలిగింది.