శంషాబాద్ : డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాల మేరకు ఇండిగో, గోఎయిర్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు సంబంధించిన పలు దేశీయ విమాన సర్వీసులు మంగళవారం రద్దయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఏడు ఇండిగో విమానాలతోపాటు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన గోఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానం కూడా రద్దయింది. దీంతో ముందుగా ఆయా విమానాల్లో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆయా నగరాల నుంచి రాకపోకలు సాగించే ఇండిగో, గోఎయిర్‌లైన్స్‌కు చెందిన మిగతా విమానాలు యథాతథంగా నడవటంతో ప్రయాణికులను వాటిలో సర్దుబాటు చేసినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment