
డోడొమా: టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లిడుంబే పరిధిలో హైవేపై ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 14 మంది సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షత గాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు.
అధికవేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అధికారులు కారు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, దీనిపై టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహు హసన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment