
సాక్షి, విశాఖపట్నం: ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖకు వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో పండగపూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో, ఢిల్లీ ఎయిర్ఇండియా, విజయవాడ ముంబయి,హైదరాబాద్, చెన్నై,ఇండిగో, ఎయిర్ఇండియా,విమానాలు రద్దయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారి పొగ మంచు ఏర్పడటం వల్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
పండగ రోజు తమను గమ్యస్థానాలకు వెళ్లకుండా చేశారని ప్రయాణికులు ఇండిగో, ఎయిర్‌ఇండియా విమాన సంస్థల అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment