దేశంలో కోవిడ్ కారణాల వల్ల విమాన సర్వీసుల్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం దేశీయ విమానాయన సంస్థ ఇండిగో 'ప్లాన్ బి'ని అందుబాటులోకి తెచ్చింది. ఇండిగో ఎండ్ నుండి ఫ్లైట్ రద్దు చేసినా లేదా రీషెడ్యూల్ చేసినా ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఎందుకంటే ప్రయాణికుల సౌకర్యార్ధం తమ వద్ద ప్లాన్ బి' ఉందని తెలిపింది. ఇంతకీ ఆ ప్లాన్ బి' ఏంటని అనుకుంటున్నారా? మీ ఫ్లైట్ సమయం/లేదా తేదీని మార‍్చుకోవచ్చు. ఇండిగో నిబంధనలకు లోబడి ఉంటే ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా లేకుండా రీఫండ్ పొందవచ్చని ఇండిగో తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.
#6ETravelAdvisory: Do not wait in queue, for any cancelled/rescheduled flight for more than 2 hrs visit- https://t.co/evofgYvfrV, all the options available on Plan B are same that are offered at our contact center.
— IndiGo (@IndiGo6E) January 5, 2022
For further assistance DM us on Twitter/Facebook pic.twitter.com/AuFYvUEumY
ఇండిగో అధికారిక ట్విట్ ప్రకారం.. 2 గంటల కంటే ఎక్కువసేపు రద్దు చేయబడిన లేదా, రీషెడ్యూల్ చేయబడిన ఏదైనా విమానాల కోసం ప్రయాణికులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. “ప్రస్తుతం కోవిడ్‌తో ప్రయాణ పరిమితులు, వాతావరణంలో మార్పుల కారణంగా విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడొచ్చు. అందుకే మార్పులు లేదా రద్దు చేయాల్సి వస్తే ప్రయాణీకులకు వారి రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్‌కు సమాచారం అందిస్తామని ఇండిగో ఎయిర్‌లైన్ ట్వీట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment