వరదనీటిలో వోల్వో బస్సు.. | volvo bus is struck in flood water in nellore district | Sakshi
Sakshi News home page

వరదనీటిలో వోల్వో బస్సు..

Published Tue, Nov 17 2015 8:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

వరదనీటిలో వోల్వో బస్సు..

వరదనీటిలో వోల్వో బస్సు..

తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు
సాయం కోసం 40 మంది ప్రయాణికుల ఎదురుచూపులు

గూడూరు(నెల్లూరు జిల్లా): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని చైతన్య ఆర్ట్స్ కాలేజీ సమీపంలో మంగళవారం ఉదయం ఓ వోల్వో బస్సు వరదనీటిలో చిక్కుకుపోయింది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, అందులో ఉన్న ప్రయాణికులు వోల్వో బస్సు నుంచి కిందకు దిగితే వరద నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో చేసేదేమీ లేక ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. బస్సు తిరుపతి నుంచి గుంటూరు వెళ్లాల్సి ఉంది.

పోలీసులకు, ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసినా సరైన స్పందన లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రెగ్యూలర్ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడం ద్వారా ఈ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయినట్లు సమాచారం. ఓ వైపు బస్సు దిగలేని పరిస్థితి, మరోవైపు సహాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని వారు సాయం చేయండంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement