
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ వైద్య పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు 3 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించింది. గత 24 గంటల్లో 11,364 వైద్య పరీక్షలు చేసింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల సంఖ్య 3 లక్షల 4 వేల 326కు చేరింది. మిలియన్‌కు 5699 వైద్య పరీక్షలు చేస్తూ ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాగా, ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 1807 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా రికార్డ్ స్థాయిలో 68 శాతం రికవరీ రేటు నమోదైంది. గత 24 గంటల్లో 66 కేసులు నమోదు కాగా, 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా పాజిటివ్ కేసుల్లో విదేశాల నుండి వచ్చిన వారు 17 మంది, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు 8 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment