
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,48,078 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, వాటిల్లో 99,391 పాజిటివ్ కేసులున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 76,967 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 22,843 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు.
ఒక్కరోజులో 26,767 పరీక్షలు...
గురువారం అత్యధికంగా 26,767 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 1,967 మందికి కరోనా సోకింది. 8 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 737కి చేరింది. కొత్తగా 1,781 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,687 యాక్టివ్ కేసులున్నాయి. అందులో 15,332 మంది ఇళ్లలో లేదా ఇతరత్రా సంస్థల్లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 473 నమోదయ్యాయి. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 202, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 170, వరంగల్ అర్బన్ జిల్లాలో 101, కరీంనగర్‌లో 86, జగిత్యాలలో 81, ఖమ్మంలో 79, నిజామాబాద్‌లో 69 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment