గుర్తించిన వీధి బాలలకు థర్మల్ స్క్రీనింగ్ చేసి, కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వీధి బాలలను గుర్తించి వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి సంరక్షించే అరుదైన కార్యక్రమం ముస్కాన్ కోవిడ్–19కు విశేష స్పందన లభించింది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మూడు రోజుల్లో 837 మంది వీధి బాలలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి కరోనా లక్షణాలు ఉండటంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లాల్లోని ఇద్దరిని గిద్దలూరు క్వారంటైన్‌కు, విజయనగరం జిల్లాలో ఒకరిని హోం క్వారంటైన్‌ను తరలించారు. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను సీఐడీ అడిషినల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ సాక్షికి తెలిపారు.
► డీజీపీ సవాంగ్ ఈ నెల 14న ప్రారంభించిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్–19 కార్యక్రమం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోను ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది.
► గడిచిన 3 రోజుల్లో 2,670 మంది వీధి బాలలను పోలీసులు గుర్తించారు. వారిలో 2,339 మంది బాలురు, 331 మంది బాలికలున్నారు. 33 మంది ఇతర రాష్ట్రాల వారున్నారు.
► గుర్తించిన వీధి బాలల్లో 2,500 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చగా, మరో 170 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు.
► బాలికలతో చాకిరీ చేయిస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేయగా, మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment