street children
-
వైరల్: నెటిజన్లు మెచ్చిన పసి హృదయం
దేశంలో దాదాపు 47.2 కోట్ల మంది చిన్నారులున్నారు. అయితే వీరిలో చాలా మంది పొలం పనులకు వెళ్లడం, చెత్త ఏరుకోడం, రోడ్ల కూడళ్లలో బెలూన్లూ, పెన్నుల వంటివి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక సమాజంలో కొన్ని సన్నివేశాలు సినిమాను మించి ఉంటాయి. అవి చూసిన మనిషికి కన్నీళ్లు తెప్పిస్తాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఓ వీధి బాలుడు కారు వద్దకి వెళ్లి ఏదైనా ఇవ్వమని అడుగుతాడు. అయితే అంతే వయసు ఉన్న కారులోని పిల్లాడికి ఆ దృష్యాన్ని చూసి హృదయం ద్రవించుకుపోయింది. అంతే తన దగ్గర ఉన్న డబ్బులను తీసి ఇస్తాడు. అతడు ఆడుకోవడానికి తన జేసీబీ బొమ్మను ఇచ్చాడు. ఇద్దరూ బొమ్మకార్లతో ఆడుకుంటారు. అంతేకాదండోయ్ తినడానికి ఏదైనా తీసుకురమ్మని చెప్పి ఇద్దరు కలిసి పంచుకు తిన్నారు. జేసీబీ బొమ్మను తిరిగి ఇస్తుంటే.. గిప్ట్గా ఉంచుకోమన్నట్టు కనిపించే దృష్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో.. తెలియదుకానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘పిల్లలు దేవుళ్లతో సమానం. కారులోని అబ్బాయి, ఆ వీధి బాలుడు ఇద్దరిది విడదీయరాని బంధమై ఉంటుంది. దేవుడి ఆశీసులు వారికి ఎప్పుడూ ఉంటాయి.’’ అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘నిజంగా ఇదో అద్భుతమైన దృష్యం. దీన్ని చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. సినిమాల్లో వచ్చే ఇలాంటి సన్నివేశాలు ఎక్కడి నుంచో పుట్టవు.. మనిషి జీవితాల్లోని సంఘటనలే.’’ అంటూ రాసుకొచ్చాడు. చదవండి: రాస్ టేలర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు -
వీధిబాలల గుర్తింపులో వినూత్న మలుపు
ప్రభుత్వం దృష్టికి వస్తున్న సమస్యకు వెనువెంటనే పరిష్కారం వెతకడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్న కొత్తధోరణి. ఎప్పటి మాదిరి గానే ఈ ఏడాది ఇది జరిగినా ఈసారి అది ఒక సరికొత్త సంస్కరణకు దారితీసింది. అక్టోబర్ 21 పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో నాలుగు రోజులపాటు నిర్వహించిన ‘మిస్సింగ్’ పిల్లల గాలింపు చర్యల్లో 16,400 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లల్ని ‘వీధి బాలలు’గా గుర్తించి రక్షణ కల్పించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఈ పిల్లల్లో పెద్ద సంఖ్యలో బాలికలు కూడా ఉన్నారు. వీరంతా మన రాష్ట్రంలో పలు పరిశ్రమలు, రెస్టారెంట్లలోనూ, వ్యవసాయ పనులలోనూ, మరికొందరు బిక్షాటనలోనూ ఎటువంటి భద్రతలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో నిర్వహించిన ఆరవ ‘డ్రైవ్’లో 4,800 మంది పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామనీ, అయితే ఈ ఏడవ ‘డ్రైవ్’లో 16,400 మంది దొరకడం అంటే, ఇది దేశంలోనే పెద్ద సంఖ్య అనీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ అంటున్నారు. ఈ పరిణామం మూలాల కోసం ఇక్కణ్ణించి మనం ఆరేడు నెలలు వెనక్కి వెళ్లి చూసినప్పుడు, అప్పటికి మన దేశం ‘కోవిడ్ కారణంగా ‘లాక్డౌన్’లో వుంది. ఏప్రిల్–మే నాటికి వలస కార్మికుల దుస్థితి, పరిష్కారానికి అలవికాని స్థాయికి చేరింది. ఈ దశలో అందరూ కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూసినప్పటికీ, ‘అస్సలు వాళ్ళంతా ఏ రాష్ట్రాల వారు, వాళ్ళు ఎక్కడికి వలస వెళ్లి ఏమి పనిచేస్తున్నారు వంటి గణాంకాలు ఏవీ తమ వద్ద లేవు’ అని ప్రభుత్వం పార్లమెంట్‌లోనే తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. అయితే పనిస్థలం నుంచి స్వస్థలాలకు తిరుగు ప్రయాణానికి ఇటు దక్షిణ రాష్ట్రాలకు అటు సెంట్రల్ ఇండియాకు భౌగోళికంగా మధ్యన వున్న ఏపీ.. వలస కార్మికులకు ఒక ‘వారధి’గా నిలి చింది. విజయవాడ జంక్షన్ అందుకు సాక్షి కావడమే కాదు, అది అన్నార్తులైన బాటసారులను అక్కున చేర్చుకున్న– ‘అమ్మఒడి’ అయింది. అయితే ఇది జరిగిన ఆరు నెలలలోనే మళ్ళీ అవే రాష్ట్రాలకు చెందిన బాలలు పెద్ద సంఖ్యలో ఇక్కడ బతుకుదెరువు వెతుకులాటలో, అమానవీయ పరిస్థితుల్లో పరిపాలనా యంత్రాంగం నిఘా దృష్టికి రావడం, ఇప్పుడు లోతైన అధ్యయనం అవసరమైన అంశం అవుతున్నది. ఐతే గడచిన 3 దశాబ్దాల్లో ఇక్కడ సామాజిక శాస్త్రాల చదువులు అటకెక్కడం కూడా మనం మర్చిపోకూడదు. కరోనా వైరస్ సమస్య ‘ఎపిడమిక్’ స్థాయికి చేరాక, మొదట ఈ పిల్లల తల్లిదండ్రులు, ఆ తర్వాత పిల్లలకు ఆంధ్రప్రదేశ్ మజిలీ స్థావరం కావడానికి, దీని భౌగోళిక ‘ప్రాధాన్యతా స్థానం’ ఒక్కటే కాకుండా, ఇతర కారణాలూ ఉన్నాయి. 1. తూర్పు కనుమలలో ఈ రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలుగా వర్గీకరించడం 2. ఈ బాలలు పెద్ద ఎత్తున ఖనిజ వనరుల తవ్వకాలు జరుగుతున్న రాష్ట్రాలకు చెందినవారు కావడం 3. ప్రాజెక్టు నిర్వాసితుల్లో ఇంకా కొందరికి ప్రభుత్వ రికార్డుల్లో చోటు లేక సహాయం అందకపోవడం 4. స్థానిక సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఈ కుటుంబాలకు ఉపాధి భద్రత లేకపోవడం 5. ఆంధ్రప్రదేశ్‌లో వేతనాలు ఎలా ఉన్నప్పటికీ ఉపాధి, స్పందించే పౌర సమాజం, జీవన భద్రతకు మెరుగైన పోలీసింగ్ ఇక్కడ ఉండడం వంటివి కొన్ని స్థూలంగా కనిపిస్తున్నాయి. లోతుల్లోకి వెళితే తెలియనివి ఎన్నో ఉండొచ్చు. అయితే, అందుబాటులో ఇంత పెద్ద సంఖ్యలో వీధి బాలలు ఉంటే, రేపు వీరి నిస్సహాయతను ‘క్యాష్’ చేసుకునేవారికి వీరు చౌకైన కూలీలు అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్నప్పుడు, హిందీ భాష మాట్లాడగలిగిన ఈ పిల్లల్ని మున్ముందు ఇక్కడి చీకటి శక్తులు అసాంఘిక చర్యలకు వాడుకోవడం తేలిక. ప్రతిపాదిత పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తర్వాత కోస్తాంధ్రలో రూపుతీసుకునే నేరమయ సామాజిక ముఖచిత్రం పట్ల, మన ముందస్తు అప్రమత్తత అవసరాన్ని ఈ ‘2020 ఆపరేషన్ ముస్కాన్’ వెలుగులోకి తెచ్చింది. ఈ దశలో సీఎం చొరవతో ప్రభుత్వం రాష్ట్రంలో ‘జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) 2015’ చట్టం అమలుకు ఉపక్రమించింది. ఈ చట్టంలోని సెక్షన్ 107 ప్రకారం, ప్రతి పోలీస్ స్టేషన్లో ‘చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్’ పోస్ట్ ఉండాలి. వీరు స్టేషన్లో విధుల్లో ఉన్నప్పుడు గులాబీ రంగు ‘టీ–షర్టు’తో ఉంటారు. ఇందులో భాగంగా ముందుగా కృష్ణాజిల్లాలో ఐదు ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ పోలీస్ స్టేష న్లను ప్రత్యేకంగా రూపొందించారు. సమస్య మూలాల్లోకి చూసినప్పుడు, భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘ఆర్ – ఆర్ – 2013 ప్యాకేజీ’ హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలోనే తయారైంది. అది రూపొందించిన ‘సామాజిక ప్రభావిత అంచనా’ ప్రమాణాలు దక్షిణ ఆసియాలోనే అత్యంత సమగ్రమైనవిగా ప్రపంచ బ్యాంక్ గుర్తించింది. అటువంటప్పుడు, దానిపట్ల ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ స్పృహ ఉంటుందనీ, ఉండాలనీ మనం ఆశిస్తాం. పోలవరం ఆదివాసీ నిర్వాసితుల పునరావాసం విషయంలో ఈ చట్టం స్ఫూర్తిని నిజాయితీతో మనం అమలు చేయాలి. అటువంటిదే, నల్లమల అటవీ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కూడా. అటువంటి సున్నిత స్పృహ కనుక లేకపోతే జరిగేది ఏమిటో, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల అసంపూర్ణ పునరావాస చర్యలు నుంచి తెలుసుకోవడం అవసరం. పాతికేళ్ళ క్రితం నల్లగొండ జిల్లా దేవరకొండ మండల గ్రామాల్లోని సుగాలీ తండాల్లో తల్లులు జీవిక కోసం తమ ఆడశిశువుల్ని అమ్ముకొంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కలెక్టర్ శ్రీమతి నీలం సాహ్నీ (1996–99) చొరవతో, సమస్య మూలాల్లోకి వెళితే, డొంక కదిలి చివరికి వెలుగులోకి వచ్చిన విషయం– వాళ్ళంతా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు అని! అయితే, ‘కోవిడ్–19’ తీవ్రతతో ఆంధ్రప్రదేశ్ మీదుగా తమ స్వస్థలాలకు వెళుతున్న వలసకార్మికుల విషయంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అనుసరించిన మానవీయ ధోరణితోపాటు, పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శ్రీమతి నీలం సాహ్నీ ఉండడం కేవలం యాదృచ్ఛికమే! వ్యాసకర్త: జాన్సన్ చోరగుడి, అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత ఈ–మెయిల్ : johnson.choragudi@gmail.com -
అంతులేని వ్యథ
గతి తప్పిన బాల్యం.. గమ్యం లేని ప్రయాణం.. లక్ష్యం లేని జీవితం.. ఎక్కడ పుట్టామో తెలియదు.. ఎలా బతకాలో అర్థం కాదు.. తల్లిదండ్రులు ఉన్నారో లేదో గుర్తులేదు.. అనాథ బాలలు వీరు.. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి ఒకరు.. కుటుంబం నుంచి తప్పిపోయి మరొకరు.. ఇలా జీవన పోరాటంలో భిక్షాటన చేస్తూ.. బాలల సంరక్షణ కేంద్రాలకు చేరిన అభాగ్యులు వారు. ఇలాంటి వారిలో కొందరినైనా సొంత గూటికి చేర్చేందుకు ఆయా ప్రాంతాల్లోని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్) సిబ్బందిప్రయత్నిస్తూనే ఉంటారు. పలమనేరు: పదేళ్ల తర్వాత ఒడిశాలోని చిల్ట్రన్ హోమ్‌నుంచి వీకోట మండలంలోని తన స్వగ్రామమైన బోడిగుట్లపల్లి చేరుకున్న అనామిక కథ తెలిసిందే. గురువారం కుటుంబ సభ్యులు, బంధువుల చెంతకు చేరిన ఆ బాలిక చిన్న నాటి నుంచి తన వారి చెంతకు చేరాలని తాను పడ్డ తపన.. బాధలు.. వారితో పంచుకుంది. తన లాగే మన జిల్లాకు చెందిన వారు అక్కడి దయావిహార్లో ఉన్నారని ఇక్కడి అధికారులకు తెలిపింది. దీంతో వారిని సైతం తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అమ్మానాన్న చెంతకు చేరాలని ఓ బాలిక ఆరాటం జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఒడిశాలోని పూరి ప్రాంతం నుంచి అక్కడి స్వచ్ఛంద సంస్థల ద్వారా కనాస్ హోమ్‌లో ఉన్నట్టు అనామిక ఇక్కడి ఐసీపీఎస్ అధికారులకు చెప్పింది. తనకు తెలుగు కొద్దిగా వచ్చు కాబట్టి తనతో ఆ బాలిక వివరాలు చెప్పి తనను ఎలాగైనా సొంత ఊరికి చేర్చాలని రోదించిందట. దీంతో ఆబాలిక చిరునామా.. ఫోటోల కోసం ఇక్కడి చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్‌ది మరోకథ ఎక్కడినుంచి వచ్చాడో తెలియని విజయ్ తిరుపతిలోని చిల్ట్రన్ హోమ్‌కు ఎనిమిదేళ్ళ క్రితం చేరాడు. ఇప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాలు. చిన్ననాటి జ్ఞాపకాల మేరకు పత్తికొండ అడవిలో తమ తల్లిదండ్రులున్నట్టు అక్కడి అధికారులకు తెలిపాడు. దీంతో చిత్తూరు నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మల్లెల శివ ఆ బాలుడి తల్లిదండ్రులను వెతికే పనిలో పడ్డారు. సంబంధిత అంగన్వాడీ వర్కర్ల ద్వారా చిరునామా అన్వేషణ చేపట్టారు. జిల్లాలో పత్తికొండ గ్రామం గంగవరం మండలంలో ఉన్నట్టు గుర్తించి గత రెండు రోజులుగా స్థానిక సీడీపీవో రాజేశ్వరి సిబ్బంది కలసి ఆరా తీశారు. ఎట్టకేలకు పత్తికొండ సమీపంలోని అటుకురాళ్ళపల్లి అటవీ ప్రాంతంలో విజయ్ తల్లిదండ్రులను కలిశారు. చిన్నప్పుడు తప్పిపోయిన వారి కుమారుడు తిరుపతిలో ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. ఆ మాట చెప్పగాని తల్లిదండ్రులు ఎగిరి గంతేస్తారని అధికారి అనుకున్నారు. అయితే వారు ‘‘ఉంటే ఉండనీ.. వాడు ఇక్కడికొస్తే మాలాగే పాములు పట్టి ఆడించుకోవాల్సిందేగా’’ అన్ని నిట్టూర్చినట్టు తెలిసింది. దీంతో చేసిదిలేక విజయ్‌కు ఏదైనా చేతిపని నేర్పించి ఆపై స్వగ్రామానికి పంపేలా అధికారులు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటివారెందరో? చిన్నతనంలో పారిపోయిన పక్క రాష్ట్రాల్లో వీధిబాలలుగా ఎందరో జిల్లాకు చెందిన చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్టు సమాచారం. ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా వారు పట్టణాల్లోని చిల్డ్రన్ హోమ్‌లకు చేరుతుంటారు. వారిని 18 సంవత్సరాల దాకా మాత్రమే అక్కడ ఉంచుకుంటారు. ఆపై తల్లిదండ్రుల సమాచారం లభిస్తే వారి చెంతకు చేర్చుతుంటారు. లేదంటే వారి దారిన వారిని వదిలేస్తుంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లాస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కార్యాలయాలుంటాయి. అక్కడి హోమ్‌లోని బాల, బాలికల వివరాల మేరకు సంబంధిత రాష్ట్రం, జిల్లాలకు ఈ కార్యాలయాలనుంచి సమాచారం అందుతుంటోంది. అయితే ఆ అభాగ్యుల భాగ్యం బాగుంటే వారు తల్లిదండ్రులకు చెంతకు చేరే అవకాశం ఉంటుంది. దశాబ్దాల నిరీక్షణలో ఉన్న చిన్నారులను వారి తల్లిదండ్రులకు వద్దకు చేర్చేందుకు సంబంధిత అధికారులు మరింత చొరవ చూపితేనే వారి బతుకులు మారుతాయి. -
837 వీధి బాలలకు కోవిడ్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వీధి బాలలను గుర్తించి వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి సంరక్షించే అరుదైన కార్యక్రమం ముస్కాన్ కోవిడ్–19కు విశేష స్పందన లభించింది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మూడు రోజుల్లో 837 మంది వీధి బాలలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి కరోనా లక్షణాలు ఉండటంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లాల్లోని ఇద్దరిని గిద్దలూరు క్వారంటైన్‌కు, విజయనగరం జిల్లాలో ఒకరిని హోం క్వారంటైన్‌ను తరలించారు. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను సీఐడీ అడిషినల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ సాక్షికి తెలిపారు. ► డీజీపీ సవాంగ్ ఈ నెల 14న ప్రారంభించిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్–19 కార్యక్రమం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోను ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ► గడిచిన 3 రోజుల్లో 2,670 మంది వీధి బాలలను పోలీసులు గుర్తించారు. వారిలో 2,339 మంది బాలురు, 331 మంది బాలికలున్నారు. 33 మంది ఇతర రాష్ట్రాల వారున్నారు. ► గుర్తించిన వీధి బాలల్లో 2,500 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చగా, మరో 170 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ► బాలికలతో చాకిరీ చేయిస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేయగా, మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులిచ్చారు. -
బతుకు‘బందీ’
మారని రాతలు.. బాగుపడని బతుకులు.. బడికెళ్లలేని పిల్లలు.. ఆర్థిక అవసరాలో.. అనాథల పిల్లలో.. పొట్టకూటి కోసం ఆరాటం.. వెళుతున్న బండ్లతో పోరాటం.. రోజూ ఇదే వీరి సాహసం. ప్రమాదమని తెలిసినా బడికి వెళ్లాల్సిన పిల్లలు కదులుతున్న బస్సులో ప్రయాణికులకు తినుబండారాలు, వాటర్, మజ్జిగ ప్యాకెట్లు విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో పొట్ట నింపుకుంటున్నారు. మరో వైపు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. రైల్వేకోడూరు పాతబస్టాండులో బడిఈడు పిల్లల పరిస్థితి ఇది. బాలకార్మిక చట్టాలు సరిగా అమలవుతున్నా.. అధికారుల కంట పడినా వీరి రాతలు మారుతాయేమో కదా!! –కె.సుబ్బరాయుడు(రైల్వేకోడూరు రూరల్) -
అమ్మానాన్నలే అడుక్కోమన్నారు
సాక్షి, సిటీబ్యూరో: ‘బాలానగర్ నర్సాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద 11 మంది పిల్లలు భిక్షాటన చేస్తుండటాన్ని గుర్తించిన ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ కెమెరాతో ఫొటో తీశాడు. ఎందుకు అడుక్కుంటున్నారు..మంచిగా చదువుకోవచ్చు కదా అని అడిగితే వారి నుంచి సమాధానం కరువైంది. దీంతో అతను ఫొటోలను ట్విట్టర్ ద్వారా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు పంపాడు. దీంతో రంగంలోకి దిగిన బాలానగర్ ఆపరేషన్ స్మైల్ బృందం సహకారంతో అక్కడ పిల్లలు, పాపలను ఎత్తుకుని భిక్షాటన చేస్తున్న బాలికలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వివరాలు రాబట్టగా గుల్బార్గాకు చెందిన ఎనిమిది మందితో కన్న తల్లిదండ్రులే భిక్షాటన చేస్తున్నట్లు తెలుసుకొని అవాక్కయ్యారు. వీరిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి శిశువిహార్ హోమ్‌కు తరలించారు. సెప్టెంబర్ నెలలో బాలకార్మికులతో పాటు రోడ్ల వెంట చెత్త ఏరుకుంటున్న పిల్లలు...ఇలా 58 మందిని సంరక్షించారు. బాలకార్మికులతో పని చేయించుకుంటున్న 19 మందిపై కేసులు నమోదుచేశారు. 39 మంది చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచగా పునరావాస కేంద్రాలకు తరలిం చారు. వీరందరినీ పాఠశాలకు పంపిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
మధుర క్షణం
రైల్వే స్టేషన్లలో.. రైలు బళ్లలో.. చిరిగిన బట్టలతో.. దుమ్ము పట్టిన జుట్టుతో దీనంగా జీవచ్ఛవాల్లా కదిలే వీధి బాలలను గుర్తు తెచ్చుకోండి. వారిలో చాలా మంది ఒకప్పుడు తమ ఇళ్లలో గారాల పట్టీగానో, ముద్దుల బాబుగానో నిండు కళతో తిరిగినవాళ్లే. ఇంటి మీద అలిగో, చదువు భారంతోనో, దారి తప్పో, ఇంకెవరి మీదో కోపంతోనో రైలెక్కేసి అమ్మ ఒడి వీడారు.. నాన్న వేలు వదిలారు. ఇంటి నుంచి పారిపోయి వీధి బాలలుగా మారారు. పలకా బలపం పట్టాల్సిన చేతులతో యాచించారు. చింపిరి జుట్టు.. చిరిగిన బట్టలతో.. చెత్త కుప్పలే లోగిళ్లుగా బతికారు. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయంతో హాయిగా సాగాల్సిన వీరి బాల్య జీవితం.. అథోగతి పాలైంది. ఇలా తెగిన గాలిపటంలా సాగుతున్న వీరి జీవితాన్ని ‘సాథి’ సంస్థ దరికి చేర్చింది. వాళ్లను తిరిగి ఇంటికి చేర్చి 20 కుటుంబాల గుండె కోతను, వ్యథను తీర్చింది.అమ్మానాన్నలను హత్తుకున్న పిల్లలు... పిల్లలను చూసి ఉద్వేగంతో కన్నీరుపెట్టుకున్న తల్లిదండ్రులు.. వారి మధ్య ప్రేమ, ఆప్యాయతను చూసి మురిసిపోయిన అధికారులు, సంస్థ ప్రతినిధులు.. శనివారం బాలుర వసతి గృహం ప్రాంగణంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ఆరిలోవ(విశాఖ తూర్పు): ప్రభుత్వ బాలుర గృహంలో సుమారు ఏడాదికిపైగా ఉంటున్న పిల్లలు శనివారం వారి తల్లిదండ్రుల చెంతకు చేరారు. తప్పిపోయిన తమ పిల్లలను చూసి.. వెంటనే హత్తుకుని తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు. ‘సాథి’ సంస్థ ఆధ్వర్యంలో 20 మంది పిల్లలను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఏడీసీపీ ఫకీరప్ప, రైల్వే డీఆర్ఎం ముకుల్ శరణ్ మాథూర్ సమక్షంలో వారి తల్లిదండ్రులను అప్పగించారు. విశాఖ రైల్వే స్టేషన్లో కనిపించిన వీధి బాలురు, ఇంటి నుంచి తప్పిపోయిన 26 మంది పిల్లలను సాథి సంస్థ గుర్తించింది. వీరిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) అనుమతితో ముడసర్లోవ వద్ద ప్రభుత్వ బాలుర గృహంలో చేర్పించింది. ఏడాదిన్నర నుంచి వీరంతా ఇక్కడే వసతి పొందుతున్నారు. ఒడిశా, బిహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర ప్రాంతాలకు చెందిన వీరి చిరునామాలను సాథి ప్రతినిధులు కనుగొని ఆయా రాష్ట్రాల పోలీసులను సంప్రదించారు. వీరి తల్లిదండ్రులను శనివారం ఇక్కడకు రప్పించి, పిల్లలను అప్పగించారు. ఏడాదికి పైగా దూరమైన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఒకరినొకరు హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. పిల్లల కోసం చాలా చోట్ల వెతికామని.. మళ్లీ కలుస్తామనే ఆశ లేకుండా పోయిందని.. సాథి సంస్థ కృషితో మళ్లీ కలిసామంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. బీజేపీ మహిళా మోర్చా నగర కన్వీనర్ మాధవీలత చార్లెస్ సహకారంతో ఒడిశాకు చెందిన పునిక్చాంద్ను కలెక్టర్ సమక్షంలో తల్లిదండ్రులను అప్పగించారు. పిల్లలను ప్రేమతో పెంచాలి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలను ప్రేమతో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. వారి అవసరాలను తీరుస్తూ.. క్రమశిక్షణ నేర్పించాలన్నారు. కుటుంబ సభ్యులంతా ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. దీనివల్ల తప్పిపోయిన పిల్లలను గుర్తించడం సులభమవుతుందన్నారు. పిల్లలను తల్లిదండ్రులను అప్పగించడానికి కృషి చేసిన సాథి సభ్యులను ఆయన అభినందించారు. ఏడీసీపీ ఫకీరప్ప మాట్లాడుతూ పిల్లలను ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి తల్లిదండ్రులకు చేర్చడంలో పోలీస్ బందోబస్తు అందిస్తామన్నారు. రైల్వే డీఆర్ఎం ముకుల్ శరణ్ మాథూర్ మాట్లాడుతూ తప్పిపోయిన బాలురను సీడబ్ల్యూసీకి అప్పగించేవరకు.. సంరక్షణ కోసం స్టేషన్లో ప్రత్యేక వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఆర్.శ్యామలరాణి, బాలుర గృహం సూపరింటెండెంట్ వీరయ్య, అబ్దుల్ రకీబ్, సాథి ప్రతినిధులు పాల్గొన్నారు. -
70 వేల మంది పిల్లలు.. డ్రగ్స్ బానిసలు!
దేశ రాజధాని నడివీధుల్లో తిరిగే దాదాపు 70 వేల మంది పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారు. తొమ్మిదేళ్ల వయసు నుంచి కూడా వాళ్లకు ఆ అలవాటు ఉంటోంది. ఈ విషయం తాజాగా ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశ రాజధాని వీధుల్లో తిరుగుతున్న ఇలాంటి వీధిబాలల ఆరోగ్యం, సంక్షేమాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవీ పెద్దగా వాళ్ల వద్దకు చేరడం లేదు. ఈ మొత్తం అంశాలపై ఢిల్లీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రభుత్వంతో కలిసి ఓ సర్వే చేసింది. వీధి బాలల గురించి ఇటీవలి కాలంలో చేసిన అతిపెద్ద సర్వే ఇదేనని ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ మృణాళినీ దర్స్వాల్ చెప్పారు. ఏదో ఒక రూపంలో దాదాపు 70 వేల మంది పిల్లలకు డ్రగ్స్ అలవాటు ఉంటోందని, 20 వేల మంది పొగాకు వాడుతున్నారని తెలిపారు. 9500 మంది మద్యం తాగుతుండగా, మిగిలినవాళ్లు రకరకాల డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని చెప్పారు. పొగాకు, డ్రగ్స్‌ను పీల్చుకునే అలవాటు తొమ్మిదేళ్ల వయసు నుంచే ఉంటోందని, 11 ఏళ్ల వయసులో మద్యం తాగడం మొదలుపెడుతున్నారని ఆమె వివరించారు. హెరాయిన్, ఒపియం లాంటి డ్రగ్స్ కూడా 12-13 ఏళ్ల నుంచి వాడేస్తున్నారు. తమ కుటుంబాల గురించి మర్చిపోడానికో, తాము కూడా పెద్దవాళ్లలా సిగరెట్లు కాల్చాలనో.. ఇలా ఏదో ఒక కారణంతో వీళ్లంతా డ్రగ్స్, పొగాకు వాడకాలు మొదలుపెడుతున్నారు. నిజానికి వీధిబాలలుగా తిరుగుతున్నవాళ్లలో 60 శాతానికి పైగా నిజానికి తమ కుటుంబ సభ్యులతో కలిసే ఉంటున్నారు. సుమారు 20 శాతం మంది పిల్లలు వీధుల్లో భిక్షమెత్తుకుని కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది. వీళ్లు ఎక్కువగా షాపింగ్ మాల్స్, రైల్వే ప్లాట్ ఫారాలు, బస్టాండులు, డంపింగ్ యార్డులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, ఆలయాలు, హోటళ్ల బయట కనిపిస్తుంటారు. ఈ పిల్లల్లో కేవలం 10.9 శాతం మంది మాత్రమే స్కూళ్లలో చదువుతున్నారు. వీధి బాలలకు డ్రగ్స్ అలవాటు మార్పించేందుకు ప్రత్యేకంగా ఆరు ఆస్పత్రులలో డ్రగ్ డీ ఎడిక్షన్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. ఒకసారి పిల్లలకు డ్రగ్స్ వాడకం అలవాటు అయితే.. వాళ్లు మిగిలిన పిల్లలను కూడా ఆ మొగ్గులోకి దించుతారని, అందువల్ల ముందు వీళ్లతో ఆ అలవాటు మాన్పించడం అవసరమని అంటున్నారు. -
2,775 మంది చిన్నారుల ముఖాల్లో ‘స్మైల్’
ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన చిన్నారులు, వీధిబాలల సంరక్షణ లో భాగంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తం గా 2,775 మంది చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపిం ది. మహి ళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు శాఖల సహకారం తో జనవరి 1 నుంచి 31 వరకు రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షెల్టర్లు తదితర ప్రాంతాల్లో ‘స్మైల్’ బృందాలు పర్యటించాయి. తప్పిపోయిన, ఒంటరిగా కనిపించిన 2,775 మంది చిన్నారులను చేరదీశాయి. వీరిలో 2,169 మంది బాలురు, 606 మంది బాలికలు న్నారు. బాలల నుంచి వివరాలను ఆరా తీసిన అధికారులు.. రాష్ట్రానికి చెందిన 2,671 మంది చిన్నారులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్ణాటక, మధ్య ప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళ నాడు రాష్ట్రాలకు చెందిన మరో 104 మందిని సైతం సొంతవూర్లకు పంపేందుకు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యు లకు అప్పగించిన వారు మినహా మిగతా చిన్నారులకు స్టేట్ హోం లలో వసతి కల్పించారు. యాదాద్రిలో అత్యధికంగా.. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా గుర్తించిన చిన్నారుల్లో అత్యధికంగా యాదాద్రి జిల్లాకు చెందినవారు ఉన్నారు. యాదాద్రిలో 398 మంది, తర్వాత హైదరాబాద్ జిల్లాలో 344 మంది చిన్నారులను గుర్తించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిలా ్లల్లోనూ ఎక్కువ సంఖ్యలో చిన్నారులను అధికారులు గుర్తించారు. మూడేళ్లుగా చేపడుతున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో ఇప్పటివరకు 13,018 మంది చిన్నారులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మానవత్వానికి మరో అవమానం
న్యూఢిల్లీ: ఓ స్వాతంత్ర్య దినోత్సవం.. ఓ మహాత్ముడి పండుగ.. ఇంకెవరో గొప్ప వాళ్ల జన్మదినోత్సవాలు. ఇలాంటి సందర్భాల్లో మాత్రం మేమంతా భారతీయ సోదరులం అని చెప్పుకుంటుంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మేమంతా సమానమే అని గొంతులు పిక్కటిల్లేలా అరుస్తూ ప్రతిజ్ఞలు చేస్తుంటారు. కానీ, వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మాత్రం మాకు మేమే.. మేమింతే అనే చందాన వ్యవహరిస్తారు. ఢిల్లీలో ఓ రెస్టారెంటు వాళ్లు ఇలాగే చేశారు. శివ్ సాగర్ అనే రెస్టారెంటుకు వెళ్లిన వీధి బాలలను గెంటివేశారు. బట్టలు మురికిగా ఉన్నాయని చెప్పి వారిని లోపలికి రానివ్వకుండా తోసేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోనాలి శెట్టి అనే సామాజిక కార్యకర్త కొంతమంది వీధి బాలలను తీసుకొని భోజనం పెట్టించేందుకు శివ్ సాగర్ అనే రెస్టారెంటుకు వెళ్లింది. అయితే, రెస్టారెంటు వాళ్లు ఆ పిల్లలు మురికిమురకిగా ఉన్నారని, డిగ్నిఫైడ్‌గా ఉండే హోటల్లో కూర్చొనివ్వడం సాధ్యం కాదని వారిని వెళ్లకొట్టారు. ఈ ఘటనపై ఓ చిన్నారి స్పందిస్తూ 'బామ్మ మాకు భోజనం పెట్టిస్తానని హోటల్‌కు తీసుకెళ్లింది. కానీ అక్కడ ఉన్న అంకుల్ బయటకు గెంటేశాడు. దీదీ డబ్బులు కూడా ఇస్తానంది. అయినా మాకు భోజనం పెట్టేందుకు, లోపలికి రానిచ్చేందుకు నిరాకరించారు. దాంతో మేం శరవణ భవన్ వద్ద భోజనం చేశాం' అని బాధపడుతూ చెప్పింది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వేగంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి 24గంటల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. ఇలాంటి రోజుల్లో కూడా వివక్ష చూపడం దారుణం అన్నారు. కాగా, హోటల్ యాజమాన్యం మాత్రం పూర్తి భిన్నంగా స్పందించింది. ఆ వీధి బాలలు లోపలికి వచ్చి అల్లరిచిల్లరగా వ్యవహరించారని చెప్పారు. డిస్ట్రబ్ చేసేవారిని బయటకు పంపడం తమ హక్కు అని చెప్పారు. తామేం తప్పు చేసినట్లు భావించడం లేదని అన్నారు. -
వీధిబాలలే లక్ష్యంగా...
అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ, హాయిగా ఆడుతూ పాడుతూ, చదువుకోవలసిన వయసులో కొందరు బాలలు మత్తుపదార్థాలకు బానిస అయ్యారు. మరికొందరు కడుపు నింపుకోవడం కోసం యాచన చేస్తుంటే, ఇంకొందరు జేబులు కొట్టేయడం, వ్యభిచారానికి పాల్పడటం వంటి అసాంఘిక కార్యకలాపాలలో భాగస్వాములయ్యారు. అలాంటి వారి దయనీయ స్థితిని చూసి ఆమె మనసు కలత చెందింది. వారికి ఆసరా ఇస్తే వీటి నుంచి దూరం కాగలుగుతారనుకుంది. అందుకే ఆమె వారి కోసం లక్ష్యం అనే పాఠశాలను స్థాపించింది. ఇంతకూ ఎవరీమె? ఈమె లక్ష్యం ఎంత మేరకు నెరవేరిందో చూద్దామా! ఢిల్లీకి చెందిన యువ సామాజిక కార్యకర్త రాశి ఆనంద్. వీధి బాలల సంక్షేమం కోసమే ‘లక్ష్యం’ అనే ఎన్జీవోను నిర్వహిస్తున్న రాశి, వసంత్ కుంజ్‌లో ‘సాక్ష్యం’ అనే పాఠశాలను స్థాపించారు. ఇందులో ఇప్పటికి సుమారు 200 మంది బాలలు చేరారు. నిర్వాహకులు వారికి చదువుతో పాటు చేతి పనులు కూడా నేర్పుతున్నారు. ఈ పిల్లల కోసం... ఫ్లై ఓవర్ల కింద చిన్న చిన్న వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. రెడ్ లైట్ ఏరియాలకు, రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడ మత్తుపదార్థాలకు బానిసలైనవారికీ, పొగాకు సేవించేవారికీ వాటి వలన కలిగే నష్టాల గురించి తెలియచేస్తున్నారు. ‘‘అతి తక్కువ కాలంలోనే అంటే కేవలం ఏడాదిన్నరలోనే మా ప్రయత్నం ఫలించింది. మా ‘లక్ష్యం’ సంస్థ జార్ఖండ్, ఢిల్లీ, బెంగళూరు, ఉత్తరాఖండ్, తమిళనాడు, కర్ణాటక వంటి ఆరు రాష్ట్రాలకు వ్యాపించింది. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అంటారు రాశి ఆనంద్. ఆ బాలలు... పాడైపోయిన టైర్లు, ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, రాళ్లు... వీటితో ఆడుకుంటారు. వారు మంచి మంచి బొమ్మలతో ఆడుకునేందుకు తనకు తోచిన సహాయం చేయాలనుకుంది. ఏదో చేయాలనే తపన కలిగించింది. ‘లక్ష్యం’ పేరుతో బొమ్మల కేంద్రం ఏర్పరిచింది. ఢిల్లీలోని పన్నెండు పాఠశాలల్లో పెద్ద పెద్ద బాక్సులు ఏర్పాటు చేసింది. ఆయా పాఠశాలల్లో చదువుకునే పిల్లలు వారి దగ్గర ఉన్న బొమ్మలను తెచ్చి ఆ బాక్సులో ఉంచేలా వారిని ఉత్తేజపరిచారు. ‘‘మాకు మంచి స్పందనే వచ్చింది. సుమారు 60,000 బొమ్మలు, పుస్తకాలు, బాక్సులు సమకూరాయి. వాటిని ఢిల్లీలోని వీధిబాలలకు అందచేశాం’’ అంటారు రాశి. బొమ్మల సంఖ్య బాగా పెరగడంతో రాశి మరిన్ని ఇతర సంస్థలతో సంబంధం పెట్టుకుని, వారి ద్వారా బీహార్ రాష్ట్రంలోని అనేక గ్రామాలకు, ధర్మశాలలోని శరణార్థులు ఉన్న ప్రాంతాలకి వీటిని అందచేశారు. అమ్మ నుంచి అలవాటయింది... ‘‘నేను ఇన్ని సాధించడానికి మా అమ్మ పూనమ్ ఆనంద్ నాకు ప్రేరణ. ఆమె ‘లక్ష్య’ అనే ఒక ఎన్జివో స్థాపించి గిరిజన మహిళలకు సేవ చేశారు. అప్పట్లో నేను అందులో సభ్యురాలిని. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఆ సంస్థ ద్వారా రాంచీలో ఒక అనాథాశ్రమం స్థాపించారు. గుడ్డి, మూగ, చెవిటి వారితో సుమారు మూడు సంవత్సరాలు పనిచేశారు. అమ్మ కారణంగానే, నేను చిన్న వయసులోనే అంటే నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేసరికే సుమారు 7381 మంది జీవితాలను దగ్గరగా చూశాను. పేద- ధనిక తారతమ్యం తెలుసుకున్నాను, సామాజిక సేవ నేర్చుకున్నాను.’’ అని చెబుతారు రాశి ఆనంద్. తల్లి స్థాపించిన లక్ష్య’ సంస్థను మరింత మందికి సేవ చేయడానికిగాను ‘లక్ష్యం’ పేరుగా 2004లో మార్పు చేశారు. మరో కోణం... ‘మిర్రర్స్’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని గత ఐదుసంవత్సరాలుగా నడుపుతున్నారు రాశి. ఇందులో భాగంగా జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాల నుంచే ‘లక్ష్యం’ సంస్థ కోసం నిధులు సేకరిస్తారు. ‘బీయింగ్ హ్యూమన్’ పేరిట వీధి బాలలకు సల్మాన్‌ఖాన్‌ను కలిసే అవకాశం కల్పించారు. ‘‘సల్మాన్‌ఖాన్ మా సంస్థకు కొంత డబ్బు విరాళంగా ఇచ్చారు’’ అని చెబుతారు రాశి. ‘ఫ్యాషన్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఒక ఫ్యాషన్ షో ఏర్పాటుచేశారు. అందులో... ఢిల్లీ రెడ్ లైట్ ఏరియాలోని ఆర్కె పురం బాలలు ర్యాంప్ మీద నడిచారు. ‘‘ఆ బాలలకు సహాయం చేయడానికి మరిన్ని నిధులు సేకరించాను. బాలీవుడ్, ఫ్యాషన్ పరిశ్రమ... అందరూ ఈ కార్యక్రమానికి వారి మద్దతు ప్రకటించి నా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు’’ సంతోషంగా చెప్పారు రాశి. ర్యాంప్ మీద జేబుదొంగలు, మత్తుపదార్థాలకు బానిసైనవారు ఎంతో వయ్యారంగా నడిచారు. ఒక్క రాత్రిలో వారి జీవితమే మారిపోయింది. ఏ చేతితో వారిని అసహ్యించుకున్నారో, అదే చేతులు ఆ బాలలతో కరచాలనం చేశాయి. ఆమె మనసు ఆనందంతో పొంగిపోయింది. మరింత మంది బాలతారల జీవితాలను మార్చడం కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్న రాశి ఆనంద్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. - డా.వైజయంతి -
బీమా ధీమా
న్యూఢిల్లీ: డబ్బావాలాలు... ఈ పేరు చెబితే ఎవరికైనా గుర్తుకొచ్చేది దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరమే. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిరోజూ దాదాపు రెండు లక్షలమంది ఉద్యోగులకు భోజన బాక్సులను అందజేస్తారు. డబ్బావాలాలు క్రమశిక్షణకు మారుపేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో వీరిపై ఓ పాఠ్యాంశం కూడా ఉంది. బ్రిటన్ రాచకుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు సైతం వీరికి ఆహ్వానం లభించింది. ఈవిధంగా ప్రపంచమంతటా పేరుగాంచిన ముంబై డబ్బావాలాలు తమ ప్రాణాలకు బీమా భద్రత కల్పించుకునే అంశంపై దృష్టి సారించారు. అంతేకాకుండా వీధిబాలలకు కడుపు నింపే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముంబైలోని డబ్బావాలాల సంఖ్య ఐదువేలకుపైనే. ఇంటిదగ్గర వండిన భోజనాన్ని సకాలంలో అందించాలనే లక్ష్యంతో, క్రమశిక్షణతో పనిచేసే వీరంతా.. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని డబ్బావాలా ఫౌండేషన్ (డీఎఫ్)...ది హేపీ లైఫ్ వెల్ఫేర్ సొసైటీ సంస్థతో కలసి వైద్య బీమా సౌకర్యం కల్పిం చనుంది. ఇందులోభాగంగా వారందరికీ బ్యాంకు ఖాతాలు, పాన్‌కార్డులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ విషయమై డబ్బావాలా ఫౌండేషన్ అధ్యక్షుడు దినకర్ బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘తమ వ్యాపార మెలకువలను నేర్చుకునేందుకు అనేకమంది యువకులు మా సంస్థలో చేరారు. ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. మా సిబ్బందికి బీమా వెసులుబాటు కల్పించాలనిగానీ లేదా పదవీ విరమణ తర్వాత పలు ప్రయోజనాలు కల్పించాలనిగానీ మేము ఏనాడూ అనుకోలేదు. అయితే ఇదొక అద్భుతమైన ఆలోచన అని అన్నారు. ‘సకాలంలో భోజనపు బాక్సులను చేరవేయాలనే తొందరపాటు ఒక్కొక్కసారి వారి ప్రాణాలపైకి తెస్తుంది. ఒక్కొక్కసారి సిగ్నళ్లను పట్టించుకోకుండా ముం దుకు సాగుతారు. అటువంటి సమయాల్లోనే వారు ప్రమాదాలకు గురవుతారు. మా వద్ద పనిచేసేవారిలో 85 శాతం మంది నిరక్షరాస్యులే. వారికి పలు ప్రయోజనాలు కల్పించాలనే ఆలోచన అత్యంత గొప్పది’ అని పేర్కొన్నారు. ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం డబ్బావాలాలకు ఇప్పటికే వైద్యసేవలతోపాటు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తమ సంఘాన్ని 2012లో సంబంధిత కార్యాలయంలో నమోదు చేశామన్నారు. షేర్ మై డబ్బా పేరిట ఓ ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామన్నారు. ఇందులోభాగంగా తమ ఖాతాదారులందరికీ ఎర్రస్టిక్కర్ను అందజేశామని, వారు భోజనం చేసిన తర్వాత అందులో ఇంకా ఏమైనా మిగిలింటే ఆ బాక్సులపై వీటిని అంటించాల్సి ఉం టుందన్నారు. ఆవిధంగా స్టిక్కర్లు అంటించిన బాక్సులను స్వచ్ఛంద సంస్థ చెందిన కార్యకర్తలకు అందజేస్తామన్నారు. అందులోని పదార్థాలను ఖాళీ చేసిన అనంతరం వారు ఆయా బాక్సులను తిరిగి తమకు ఇచ్చేస్తారన్నారు. ప్రతి రోజూ 40 నుంచి 50 మంది చిన్నారులకు ఈ ఆహార పదార్థాలు అందుతున్నాయన్నారు. ఈవిధంగా చేయడం ఎంతో సంతృప్తి కలిగిస్తోందన్నారు. అయితే అనేకమంది మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఇచ్చేందుకు ఇష్టపడడం లేదని, క్రమేణా వారి ధోరణిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమ ఖాతాదారుల వద్ద నెలకు రూ. 400 నుంచి రూ. 500 వసూలు చేస్తున్నామన్నారు. -
వినోదం అందించే పిల్లలకు పుట్టెడు కష్టాలు
వీధి బాలలు, రైల్వే స్టేషన్లలో తిరుగుతున్న పిల్లలు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు.. వీళ్లందరినీ చూస్తున్నప్పుడల్లా బాలల హక్కుల హననం గురించి గుర్తుకొస్తుంది. కానీ, కష్టాలు పడుతున్న పిల్లలంటే వీళ్లేనా? కాదు.. కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను చూసినా, సినిమాలు.. సీరియళ్లు.. రియాల్టీ షోలలో చేస్తున్న పిల్లల్ని చూసినా వీధిబాలల కంటే మరింత కష్టాలు పడుతున్నారు! ఈ విషయం పలు సర్వేలలో ఇప్పటికే బయటపడింది. ఇదే అంశాన్ని గురించి ప్రస్తావించారు పిల్లల హక్కుల ఉద్యమకారిణి, దర్శకురాలు సరస్వతీ కవుల. 'సాక్షి.కామ్'కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల హక్కుల గురించి ఆమె పలు విషయాలు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల్లో చదివే పిల్లలపై విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. ఆరో తరగతి నుంచే ఐఐటీ కోచింగ్ అంటూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాఠశాలల్లోనే నూరేస్తుంటే ఇక పిల్లలకు ఆడుకోడానికి సమయమే ఉండట్లేదు. స్కూళ్లలో ఆడుకోడానికి అరకొరగా సమయం ఇస్తున్నా.. అప్పుడు కూడా ప్లేగ్రౌండులోకి పంపకుండా కంప్యూటర్లతో ఆడిస్తున్నారు. దీంతో వాళ్లమీద విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. భవిష్యత్తు అంటూ లేకుండా పోతోంది. చాలామంది పిల్లలకు అసలు బాల్యం అంటే ఏంటో, ఆటలంటే ఏంటో కూడా తెలియట్లేదు. అయితే ఇందులో తప్పు కేవలం స్కూళ్లదే కాదు. తల్లిదండ్రులు, ఈ సమాజం కూడా అందుకు సమాన బాధ్యత వహించాల్సిందే. చదువంటే కేవలం ఉద్యోగం సంపాదించే సాధనంగా, పిల్లలంటే డబ్బు సంపాదించే యంత్రాలుగా చూస్తున్నారు. పిల్లలు కూడా ఇప్పుడున్న విద్యావిధానం కారణంగా యాంత్రికంగానే పనిచేస్తున్నారు తప్ప.. సృజనాత్మక రంగాలవైపు ఎక్కువగా వెళ్లట్లేదు. ముందుగా తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారితే మొత్తం వ్యవస్థ చక్కబడుతుంది. వినోద రంగంలోని పిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. పిల్లల్లోని కళాత్మక హృదయాలను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నా, వాస్తవానికి అక్కడ జరిగే తతంగం వేరు. రియాల్టీ షోలలో పోటీ మరీ ఎక్కువగా ఉండటంతో ఓడిపోయిన పిల్లలు మానసికంగా తీవ్రంగా దెబ్బతింటున్నారు. అది వాళ్ల మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతోందని మానసిక వైద్యనిపుణులు కూడా అంటున్నారు. చిన్నతనంలోనే బాగా వెలుగులోకి వచ్చినవాళ్లు ఆ తర్వాత ఎదురయ్యే కష్టనష్టాలను ఓర్చుకోలేకపోతున్నారు. టీవీ, సినిమా కెమెరాల ముందు భారీ లైట్ల మధ్య పనిచేయడం అంత సులభమైన పనికాదు. ఇందుకు బోలెడంత శారీరక, మానసిక శ్రమ అవసరం. పనిచేసే సమయాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. రాత్రిపూట పిల్లలు నిద్రపోవాలన్న కనీస విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. అర్ధరాత్రి వరకు కూడా షూటింగులు కొనసాగడం, వాటికోసం పిల్లలను నిద్రపోనివ్వకుండా ఉంచడం లాంటివి తరచు కనిపిస్తుంటాయి. వీధిబాలలైతే తమకు ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతారు. వీళ్లకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఉండట్లేదు. చిట్టడవుల్లో, భయానక ప్రదేశాలలో షూటింగులు చేయడం వల్ల పిల్లల మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటోంది.