సాక్షి, సిటీబ్యూరో: ‘బాలానగర్ నర్సాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద 11 మంది పిల్లలు భిక్షాటన చేస్తుండటాన్ని గుర్తించిన ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ కెమెరాతో ఫొటో తీశాడు. ఎందుకు అడుక్కుంటున్నారు..మంచిగా చదువుకోవచ్చు కదా అని అడిగితే వారి నుంచి సమాధానం కరువైంది. దీంతో అతను ఫొటోలను ట్విట్టర్ ద్వారా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు పంపాడు. దీంతో రంగంలోకి దిగిన బాలానగర్ ఆపరేషన్ స్మైల్ బృందం సహకారంతో అక్కడ పిల్లలు, పాపలను ఎత్తుకుని భిక్షాటన చేస్తున్న బాలికలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా వారి వివరాలు రాబట్టగా గుల్బార్గాకు చెందిన ఎనిమిది మందితో కన్న తల్లిదండ్రులే భిక్షాటన చేస్తున్నట్లు తెలుసుకొని అవాక్కయ్యారు. వీరిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి శిశువిహార్ హోమ్‌కు తరలించారు. సెప్టెంబర్ నెలలో బాలకార్మికులతో పాటు రోడ్ల వెంట చెత్త ఏరుకుంటున్న పిల్లలు...ఇలా 58 మందిని సంరక్షించారు. బాలకార్మికులతో పని చేయించుకుంటున్న 19 మందిపై కేసులు నమోదుచేశారు. 39 మంది చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచగా పునరావాస కేంద్రాలకు తరలిం చారు. వీరందరినీ పాఠశాలకు పంపిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment