సాక్షి, అమరావతి: ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టుకి రూ.750 మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నమూనాని విఆర్‌డిఎల్ పరీక్షకు పంపితే రూ.2800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. (పాజిటివ్ వ్యక్తులకు ‘దివ్య’ కషాయం)
ప్రతి ల్యాబ్ పరీక్షల్లో ఐసీఎంఆర్ లాగిన్‌లో డేటాను తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రులు, ఎన్ఏబిఎల్ ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment