వేగంగా నిర్ధారణ ఫలితం వస్తుండటంతో కరోనా లక్షణాలున్న బాధితులంతా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు మొగ్గుతున్నారు. దీన్నే కొందరు అక్రమార్కులు ధనార్జనగా మార్చుకుంటున్నారు. హైదరాబా ద్ నగరంలో 300 కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నా దాదాపు అన్నిచోట్లా జనం కిటకిటలాడుతున్నారు. పైగా వచ్చిన వారందరికీ పరీక్షలు చేయకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. తాకిడి పెరగడంతో ఆయా ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది మాట్లాడుకొని ఉచితంగా చేయాల్సిన పరీక్షలను సొమ్ము చేసుకుంటున్నారు. పైగా తమకు తెలిసిన వారి నుంచి వచ్చే విన్నపాలను ముందుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. కొంత మొత్తం చెల్లించాలని ముందే చెబు తున్నారు. విచిత్రమేంటంటే పైరవీ, ఎంతో కొంత చెల్లించనిదే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌చేసే పరిస్థితి చాలాచోట్ల లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో అటెండర్ నుం చి పైస్థాయి వరకు వచ్చిన డబ్బులు పంచుకుంటున్నారన్న ఆరోపణలు న్నాయి. కొన్నిచోట్ల తలా కొన్ని కిట్లు అనుకొని డబ్బులిచ్చినవారికి పరీక్ష లు చేసి పంపుతున్నారు. డబ్బులు చెల్లించలేనివారు లైన్లలో నిలబడి, కిట్లు అయిపోయాక వెనుదిరిగి పో తున్నారు. వాస్తవంగా యాంటిజెన్ పరీక్ష చేయాలంటే దానిక య్యే ఖర్చు ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం రూ.500. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ఉచితంగా చేయాలి. కానీ ఎక్కడా అటువం టి పరిస్థితి కనిపించట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment