నా చిట్టి తల్లికి ఏమయ్యింది..?
తిరుపతిక్రైం: ‘‘పరీక్షలు బాగా రాస్తున్నా ను.. నాన్నా.. అని ముందు రోజు ఫోన్ చేసింది. మరుసటి రోజు ఆత్మహత్యకు పాల్పడింది.. ఇంతలో నా చిట్టి తల్లికి ఏమయ్యింది’’ ఓ ప్రైవేట్ కాలేజీ భ వంతి పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న రేవతి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మార్‌పల్లి సీఐ షరీఫుద్దీన్ తెలిపిన వివరాల మేరకు పులిచర్ల మండలం బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎ.వెంకటరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె ఎ.రేవతి(17) రూరల్ మండలం తుమ్మలగుంట సమీపంలోని ఉప్పరపల్లెలో ఓ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది.
కొన్ని రోజులుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రేవతి స్థానిక పద్మావతి కళాశాలలో జరుగుతున్న పరీక్షలకు ప్రతిరోజూ హాజరవుతోంది. శుక్రవారం ఉదయం కూడా పరీక్షకు హాజరైంది. పరీక్ష ముగిసిన తరువాత కళాశాలకు చేరుకుని భోజనం చేసి, గదిలోని తోటి విద్యార్థులతో కలసి కొంత సేపు ఆట విడుపుగా ఉంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్టడీ అవర్స్ ఉండడంతో విద్యార్థులందరూ మొదటి అంతస్తులోని తరగతి గదికి వెళ్లారు. అయితే రేవతి మాత్రం బిల్డింగ్‌లోని మూడో అంతస్తుపైన పిట్టగోడ పైకి ఎక్కి కూర్చుని, అక్కడి నుంచి కిందకు దూకేసింది. దీన్ని గుర్తించిన కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. రేవతిని చికిత్సకోసం రుయా ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించి అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు చెప్పారు. కళాశాల యాజమాన్యం పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించా రు.
సంఘటనా స్థలానికి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మార్‌పల్లి సీఐ షరీఫుద్దీన్, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. ఈ ఆత్మహ త్య గురించి కూడా విచారించిగా రేవతి పరీక్షలు సరిగా రాయలేదని ఆందోళనలో ఉన్నట్లు సహచర విద్యార్థినులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులకు కడుపుకోత
రేవతి(16) మృతి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంకటరెడ్డి, లక్ష్మీదేవి, హుటాహుటిన రుయా ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. కుమా ర్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు గా విలపించారు. గురువారం సాయంత్రం ఫోన్ చేసి ‘పరీక్షలు బాగా రాస్తున్నాను నాన్నా’ అని చెప్పిన తన కుమార్తెకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి అంటూ తల్లి విలపించడం అక్కడి వారి ని కలచివేసింది. మృతురాలి తండ్రి మాట్లాడుతూ ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలున్నాయని ఆరోపించారు.
పెద్దిరెడ్డి పరామర్శ
మెడికల్ కళాశాల మార్చురీ వద్దకు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడి, ఈ సంఘటన పై ఆరా తీస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలేజీ సిబ్బందికి సూచించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్ సీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కళాశాల నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు చో టు చేసుకుంటున్నాయన్నారు. కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డును డిమాండ్ చేశారు. విచారణ జరిపి నిందితులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు జాఫర్ ఉన్నారు.