- ఏప్రిల్ 1 నుంచే ఒకటో తరగతి నుంచి 9వ తరగతుల పరీక్షలు
- 11 నుంచి పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్
సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలను 15 రోజుల ముందుగానే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. సాధారణంగా వీటిని ఏప్రిల్ 15 నుంచి నిర్వహించాలని గతంలోనే తేదీలు ఖరారు చేశారు. అయితే వాటిని ఏప్రిల్ 1 నుంచే నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. ఈ నెల 25 నుంచి మొదలయ్యే టెన్త్ పరీక్షల స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే 9 తరగతుల పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం అయితే టీచర్లంతా ఆ పనుల్లోనే ఉంటుండడంతో 1 నుంచి 9 తరగతుల పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాన్ని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టెన్త్ మూల్యాంకనం కంటే ముందుగానే పరీక్షలను ప్రారంభించనున్నారు.
8వ తరగతి వరకు పరీక్షలు ఆరు రోజుల్లో పూర్తి కానున్నాయి. 9వ తరగతిలో 11 పేపర్ల విధానం ప్రవేశపెట్టడంతో ఏప్రిల్ 11తో పూర్తవుతాయని పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు పేర్కొన్నారు.