
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటికే ఆయనకు పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన పేషీలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు మేయర్‌కు మరోసారి పరీక్షలు చేశారు. మేయర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, మేయర్ పేషీ సహ బల్దియా ప్రధాన కార్యాలయంలో వారంలో మొత్తం 3 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే వారిలో శుక్రవారం దాదాపు సగం మంది మాత్రమే హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment