
Samantha Falls Sick And Tested In Private Hospital: స్టార్ హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో టెస్టులు చేయించుకొని వెళ్లింది. గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన సమంత ప్రస్తుతం జర్వం, జలుబుతో బాధపడుతోంది. దీంతో హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో టెస్టులు చేయించుకుంది.
అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. అయితే సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆమె మేనేజర్ మహేంద్ర స్పందించారు. సామ్ ఆరోగ్యంగా ఉన్నారని, స్వల్ప అస్వస్థత కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని పేర్కొన్నారు.