ప్రశాంతంగా జరిగిన ఎక్సైంజ్ కానిస్టేబుల్ పరీక్షలు
పటాన్‌చెరు టౌన్ : మండలంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలు ప్రశాతంగా జరిగాయి. మొత్తం ఏడు కేంద్రాల్లో ఈ పరీక్షలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు. మండలంలో మొత్తం 4,704 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 3, 671 మంది రాశారు. మొత్తం 1,033 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.
మండలంలోని గీతం1, 2 కళాశాలల్లో 784 మంది , 782 మంది, సెయింట్‌జోసఫ్ హైస్కూల్ 393 మంది, మంజీరా డిగ్రీ కళాశాలలో 256మంది, ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాలలో 433 మంది, టర్భో మిషనరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో 461 మంది, టీఆర్‌ఆర్ కళాశాలలో 562 మంది పరీక్ష రాశారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆలస్యంగా పరీక్షకు వచ్చిన వారిని అనుమతించలేదు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను చెక్ చేసిన తరువాతే వారిని పరీక్షకు అనుమతించారు. మొత్తం మీద మండలంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలు ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రశాతంగా ముగిశాయి.