హైదరాబాద్‌లో హెల్త్‌ ఏటీఎం చూశారా? అన్ని పరీక్షలు ఇక్కడే! | Digital ATM clinic in India first time at Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో హెల్త్‌ ఏటీఎం చూశారా? అన్ని పరీక్షలు ఇక్కడే!

Published Sat, Sep 16 2023 11:39 AM | Last Updated on Sat, Sep 16 2023 12:45 PM

Digital ATM clinic in India first time at Hyderabad - Sakshi

మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, విపరీతమైన కాలుష్యం కారణంగా చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా రకరకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా  టీనేజర్లు, స్కూలు విద్యార్థులు కూడా గుండెజబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో ఏ చిన్న అనుమానం వచ్చినా, సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పని సరిగా మారిపోయింది. అయితే సాధారణంగా 30 ఏళ్లు నిండినవారు, కుటుంబాల్లో బీపీ,సుగర్‌, కేన్సర్‌, గుండె జబ్బుల చరిత్ర ఉన్నవాళ్లు క్రమంగా తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఉరుగుల పరుగుల జీవితంలో మనలో చాలామంది హెల్త్ చెక‌ప్స్‌ను వాయిదా వేస్తుంటాం. అలాంటివారికి గుడ్‌ న్యూస్‌ ఈ హెల్త్‌  ఏటీఎం

బ్యాంక్  ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM)  తరహాలోనే  హెల్త్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. టచ్-స్క్రీన్ కియోస్క్ హార్డ్‌వేర్,ఇది ఏదైనా ఇంటర్నెట్-కనెక్ట్ చేయబడిన వెబ్ బ్రౌజర్ నుండి వారి వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.హైదరాబాద్‌కు చెందినప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ డిజిటల్ హెల్త్‌కేర్ కియోస్క్‌ను తీసుకొచ్చింది. ఏటీఎం త‌ర‌హాలో హెల్త్ పాడ్ ఎక్విప్‌మెంట్ ద్వారా బీపీ, టెంప‌రేచ‌ర్‌, ఆక్సిజ‌న్ లెవెల్స్‌, బీఎంఐ, ఈసీజీ వంటి వివ‌రాల‌ను  నిమిషాల్లో తెలుసుకోవ‌చ్చు. రిపోర్ట్స్ వెంటనే వాట్సాప్‌, ఈమెయిల్‌, ఎస్ఎంఎస్ లేదా ప్రింటవుట్‌పై పొంద‌వ‌చ్చు. ఈ ఏర్పాటు ఆస్ప‌త్రుల్లో రోగుల ఒత్తిడిని కూడా త‌గ్గిస్తుంద‌ని అధికారులు చెబుతున్నారు.

ఇది కేవలం కొన్ని నిమిషాల్లో BMI, BMR, ఎత్తు, బరువు, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, ECG వంటి 75 కంటే ఎక్కువ విభిన్న ఇన్వాసివ్ అండ్‌ నాన్-ఇన్వాసివ్ పరీక్షలను నిర్వహించగలదు. ఏఐ ,మెషీన్‌ లెర్నీంగ్‌ సాఫ్ట్‌వేర్‌, సెన్సర్స్‌ ద్వారా ఇది పనిచేస్తుంది. ఎలాంటి స‌మ‌స్యకైనా ఈ ఆటోమేటెడ్ ట‌చ్ స్క్రీన్ కియోస్క్ ద్వారా వారు డాక్ట‌ర్‌తో టెలీక‌న్స‌ల్టింగ్ పొందే వెసులుబాటు  కూడా ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement