అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే పరీక్షలు.. పాసులు | Medical Tests Within Interstate Boundaries Says DGP Mahender Reddy | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే పరీక్షలు.. పాసులు

Published Tue, May 5 2020 3:27 AM | Last Updated on Tue, May 5 2020 3:27 AM

Medical Tests Within Interstate Boundaries Says DGP Mahender Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో తెలంగాణలో చిక్కుకున్న వలసకూలీలు, ఇతరత్రా ప్రజలు సొంత వాహనాలు, కార్లు, బస్సులు ఇతర వాహనాల్లో తమ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వారికి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారని డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా సరిహద్దు జిల్లాల కలెక్టర్లు ఇచ్చే పాసులతో స్వస్థలాలకు వెళ్లిపోవచ్చన్నారు. సరిహద్దుల వద్ద ఉన్న వైద్యులు ఈ టెస్టులు నిర్వహిస్తారన్నారు. ఈ మేరకు అన్ని చెక్‌పోస్టుల వద్ద ఏర్పాట్లు చేసుకోవాలని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీ లు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement