interstate checkpost
-
మావోయిస్టుల బంద్‌తో అప్రమత్తం
సాక్షి, మంచిర్యాల: బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానిత ప్రాంతాల్లో విçస్తృతంగా తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని రోజులుగా దళ సభ్యులు సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్న అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరంలో డ్రోన్ కెమెరాలతో నిఘా వేశారు. మరోవైపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ.. ప్రతీకార చర్యలు తప్పవని కుమురంభీం మంచిర్యాల జిల్లా కమిటీ కార్యదర్శి భాస్కర్ పేరుతో ప్రకటన విడుదల కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నెల 19న కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకుముందు పలుమార్లు దళ సభ్యులు పోలీసులకు ఎదురుపడ్డారు. ఆ సమయంలో మావోయిస్టులు వదిలిపెట్టిపోయిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఇర్నార్–పెదపాల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు తారసపడిన మావోలు కాల్పులు జరపగా.. సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఒక మావోయిస్టు మృతి చెందాడు. -
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే పరీక్షలు.. పాసులు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో తెలంగాణలో చిక్కుకున్న వలసకూలీలు, ఇతరత్రా ప్రజలు సొంత వాహనాలు, కార్లు, బస్సులు ఇతర వాహనాల్లో తమ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వారికి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారని డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా సరిహద్దు జిల్లాల కలెక్టర్లు ఇచ్చే పాసులతో స్వస్థలాలకు వెళ్లిపోవచ్చన్నారు. సరిహద్దుల వద్ద ఉన్న వైద్యులు ఈ టెస్టులు నిర్వహిస్తారన్నారు. ఈ మేరకు అన్ని చెక్‌పోస్టుల వద్ద ఏర్పాట్లు చేసుకోవాలని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీ లు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. -
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ప్రారంభం
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా రాష్ట్ర విడిపోవడంతో ఈ చెక్‌పోస్టు ఏర్పాటు తప్పనిసరని చాలారోజులుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఉన్న జీలుగుమిల్లి మండలం వద్ద ఈ చెక్‌పోస్టును డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీదేవి సోమవారం ఉదయం ప్రారంభించారు. రవాణా శాఖకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో కొన్నాళ్ల పాటు బస్సులకు మినహాయింపు ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలకు పర్మిట్లు, పన్ను రసీదులు అన్నీ చూపించాల్సి ఉంటుంది. వాటిని తనిఖీ చేసేందుకే ఈ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.