అంతర్రాష్ట్ర చెక్పోస్టు ప్రారంభం | inter state checkpost inagurated in jeelugumilli | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర చెక్పోస్టు ప్రారంభం

Published Mon, Jun 2 2014 11:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

అంతర్రాష్ట్ర చెక్పోస్టు ప్రారంభం

అంతర్రాష్ట్ర చెక్పోస్టు ప్రారంభం

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టు ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా రాష్ట్ర విడిపోవడంతో ఈ చెక్పోస్టు ఏర్పాటు తప్పనిసరని చాలారోజులుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఉన్న జీలుగుమిల్లి మండలం వద్ద ఈ చెక్పోస్టును డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీదేవి సోమవారం ఉదయం ప్రారంభించారు.

రవాణా శాఖకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో కొన్నాళ్ల పాటు బస్సులకు మినహాయింపు ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలకు పర్మిట్లు, పన్ను రసీదులు అన్నీ చూపించాల్సి ఉంటుంది. వాటిని తనిఖీ చేసేందుకే ఈ అంతర్రాష్ట్ర చెక్పోస్టు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement