- నేటితో ముగియనున్న పరీక్షలు
- ఈనెల 28న ఫస్ట్ ఇంటర్ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ప్రధాన పరీక్షలు ఈనెల 9తో ముగియనున్న నేపథ్యంలో ఫలితాలను మే నెల రెండో వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం మూల్యాంకనం పనులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలను ఈనెల 28న విడుదల చేయాలన్న యోచనలో ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఉన్నారు. ఆ తరువాత రెండు మూడు రోజులకు ద్వితీయ సంవత్సర ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.