సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఇంటరీ్మడియట్ కాన్ఫిగరేషన్ పరీక్ష (పవర్ హెడ్ టెస్ట్ ఆరి్టకల్)ను సంస్థ మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి వద్ద ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్‌సీ) సెంటర్‌లో జూలై 1న ఈ పరీక్ష జరిపినట్టు సోమవారం ఇస్రో ప్రకటించింది.
‘‘భవిష్యత్తు ప్రయోగ వాహనాలను దృష్టిలో ఉంచుకుని బూస్టర్ దశలను శక్తిమంతం చేయడం, 2000 కేఎన్ థ్రస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేయడం ఈ పరీక్ష లక్ష్యం. గ్యాస్ జనరేటర్, టర్బో పంపులు, ప్రీ–బర్నర్, కంట్రోల్ కాంపోనెంట్‌ల వంటి కీలకమైన సబ్ సిస్టమ్‌ల సమగ్ర పనితీరును 4.5 సెకండ్ల స్వల్ప వ్యవధిలో హాట్ ఫైరింగ్ చేసి ధ్రువీకరించడం దీని ముఖ్య ఉద్దేశం’’ అని తన వైబ్‌సైట్‌లో వెల్లడించింది.
ఇంధనం, ఆక్సిడైజర్ పంపులను నడపడానికి ప్రధాన టర్బైన్‌ను నడిపించే ప్రీ బర్నర్ ఛాంబర్‌లోని వేడి–గ్యాస్ జ్వలన, ఉత్పత్తిని పరీక్షించారు. ఇప్పటిదాకా లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్‌తో కలిపి క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేశారు. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను మాత్రం సరికొత్తగా తయారు చేస్తున్నారు. ఇందులో లిక్విడ్ ఆక్సిజన్‌కు తోడుగా కిరోసిన్ ప్రపొల్లెంట్ కలయికతో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. కిరోసిన్ కలయికతో సెమీ క్రయోజనిక్ ఇంజన్ తయారు చేయాలని చిరకాల ప్రయత్నం ఇప్పటికి కార్యరూపు దాల్చింది. తదుపరి పరీక్షల్లో పనితీరును మరింత మెరుగు పరుచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునే దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది.
13న చంద్రయాన్–3 ప్రయోగం
న్యూఢిల్లీ: చంద్రుడిపై అన్వేషణకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్–3 మిషన్ ఏర్పాట్లు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ నెల 13వ తేదీన ఇస్రో దీనిని ప్రయోగించనుంది. ల్యాండర్–రోవర్ కాంబినేషన్‌తో చేపట్టే ఈ ప్రయోగం లక్ష్యం చంద్రుడిలోని సుదూర ప్రాంతాల అన్వేషణ. ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు లాంచ్ విండో అందుబాటులో ఉంటుంది. అయితే, తొలిరోజే ప్రయోగం చేపట్టాలనుకుంటున్నామని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment