కెప్టెన్.. లీడర్.. విన్నర్.. | dhoni is a Captain, Leader and Winner, says Sushant Singh | Sakshi
Sakshi News home page

కెప్టెన్.. లీడర్.. విన్నర్..

Published Thu, Jul 7 2016 2:41 PM | Last Updated on Thu, Sep 12 2019 8:55 PM

dhoni is a Captain, Leader and Winner, says Sushant Singh

టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ధోనీ జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ'. నేడు టీమిండియా కెప్టెన్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ యూనిట్ ఆయనకు కానుకగా అధికారిక పోస్టర్ విడుదల చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో ధోనీగా సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ కనిపించనున్న విషయం తెలిసిందే. ధోనీ మూవీ అఫీషియల్ పోస్టర్ ను హీరో సుశాంత్ సింగ్ ట్వీట్ చేశారు. కెప్టెన్.. లీడర్.. విన్నర్.. అని తన ట్వీట్లో పేర్కొన్నాడు. ధోనీకి ఇలా ఎన్నో పేర్లు సంపాదించాడంటూ ప్రశంసించాడు. ఈ సందర్భంగా మరోసారి ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.



జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కీపర్గా తన ప్రస్థానం మొదలుపెట్టి, అనతికాలంలోనే కెప్టెన్‌గా భారత్ జట్టుకు అద్భుత విజయాలు అందించాడు ధోనీ. నీరజ్ పాండే దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుశాంత్‌తోపాటు కియరా అద్వానీ, అనుపమ్ ఖేర్‌, భూమికా చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, సుశాంత్ రాజ్‌పుత్ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ఫోస్టర్ ను ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ లో ధోనీ నెం.7 జెర్సీలో, స్కూలు రోజులు, భార్యతో కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement