ముంబై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి క్రికెట్ ఆస్ట్రేలియా ఒక స్పెషల్ వీడియో తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. బుధవారం 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ధోనీకి మంగళవారం అర్ధరాత్రి నుంచే అభిమానులు సోషల్ మీడియా విషెస్ చెప్తూ.. పాత ఫొటోలు, వీడియోల్ని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో పాటు చాలా మంది ప్రముఖులు, క్రికెటర్లు ధోనీకి విషెస్ చెప్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేకంగా రూపొందించిన ఈ వీడియోలో ధోని బాదిన సిక్సర్లను పొందుపరిచారు.
ధోని 2004లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2005లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సిరీస్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 123 బంతుల్లో 148 పరుగులతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత ధోని ఎప్పుడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 145 బంతుల్లో 183 పరుగులు చేసిన ధోని టీమిండియా తరపున వికెట్ కీపర్‌గా అత్యుత్తమ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల బాదిన జాబితాలో ధోని ఐదవ స్థానంలో ఉన్నాడు. ధోని తన కెరీర్‌లో 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలు సాధించి ఐసీసీ మూడు మేజర్ ట్రోపీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు.
📽 WATCH: MS Dhoni's best ever sixes in Australia. https://t.co/tRadt6XCkI
— cricket.com.au (@cricketcomau) July 7, 2021
Comments
Please login to add a commentAdd a comment