ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత రవీంద్ర జడేజా బంతితో (4-0-20-3) ఇరగదీయగా.. ఆతర్వాత బ్యాటింగ్‌లో వెటరన్ రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రహానేకు రుతురాజ్ (36 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకలవడంతో సీఎస్‌కే 18.1 ఓవర్ల సునాయాసంగా లక్ష్యాన్ని (158) ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో రహానే విధ్వంసక ఇన్నింగ్స్‌కు, రవీంద్రుడి మాయాజాలానికి, రుతురాజ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌కు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ ముగ్గురిని RRR (ఇటీవల ఆస్కార్ గెలిచుకున్న తెలుగు సినిమా)తో పోలుస్తూ ఆకాశానికెత్తుతున్నారు. సీఎస్‌కే అభిమానులైతే ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి పోయి తమ స్టార్ త్రయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరేమో మరో R (రాయుడు)ను కూడా RRRకు యాడ్ చేస్తూ ఆకాశానికెత్తుతున్నారు.
ఓ పక్క సీఎస్‌కే అభిమానులు ముంబైపై గెలుపుతో సంబురాలు చేసుకుంటుంటే, మధ్యలో ఆర్సీబీ ఫ్యాన్స్ జోక్యం చేసుకుంటున్నారు. ఏప్రిల్ 17న KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) సీఎస్‌కేను మింగేస్తుందని రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నారు. KGF దెబ్బకు RRR తట్టుకోలేదని కయ్యానికి కాలు దవ్వుతున్నారు. మొత్తానికి ఐపీఎల్‌లో మూడు బలమైన జట్ల మధ్య జరుగుతున్న స్టార్ వార్‌తో సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment