ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి మినీ వేలంకు సిద్ధమవుతున్న 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను భారీగానే వదులుకున్న సంగతి తెలిసిందే. జనవరి 20 (బుధవారం)తో దాదాపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్లతో పాటు రిలీజ్ చేసిన ఆటగాళ్ల ఫైనల్ లిస్టును విడుదల చేశాయి. కాగా ఐపీఎల్ మినీ వేలం ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఫుట్‌బాలర్.. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ హారీ కేన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హారీ కేన్‌కు ఐపీఎల్ అంటే మహా ప్రాణం.. ఇంగ్లీష్ ఫుట్‌బాల్‌ను ఎంతగా ఆస్వాదిస్తాడో ఐపీఎల్‌ను కూడా అంతే సమానంగా ఆదరిస్తాడు.. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్‌లోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ). ఆర్‌సీబీ అంటే హారి కేన్‌కు విపరీతమైన ప్రేమ.. అందునా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట అంటే అతనికి చాలా పిచ్చి. తాజాగా ఆర్‌సీబీ రిటైన్, రిలీజ్ లిస్ట్ విడుదల చేసిన సందర్భంగా కేన్ ఫన్నీ కామెంట్స్ చేశాడు.చదవండి: 'నట్టూ.. నీకు కెప్టెన్ అయినందుకు గర్విస్తున్నా'
'నన్ను సెలెక్ట్ చేయనందుకు చాలా నిరాశతో ఉన్నా.. రిటైన్ లిస్ట్‌లో నా పేరు లేకపోవడం బాధాకరం కానీ ఇప్పుడు ఏం చేయడానికి లేదు.. ఆర్‌సీబీపై ఉన్న ఇష్టం మాత్రం చచ్చిపోదు.. జట్టులోని ఆటగాళ్లను ఉత్సాహపరియేందుకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది.' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఈసారి ఆర్‌సీబీ 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వారిలో స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మెయిన్ అలీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసిన తర్వాత రూ. 35.7 కోట్లతో ఆర్‌సీబీ వేలానికి సిద్ధమవుతుంది.
కాగా ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన తర్వాత హారి కేన్ తన బ్యాటింగ్ స్కిల్‌కు సంబంధించిన వీడియోను కోహ్లి, ఆర్‌సీబీ హాష్‌ట్యాగ్‌తో షేర్ చేశాడు. మీ టీమ్ తరపున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు నేను సిద్ధం. వచ్చే సీజన్‌లో అవకాశం ఉంటే నాకు ఒక చాన్స్ ఇవ్వండి .. నేనేంటో చూపిస్తాను అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనిపై కోహ్లి స్పందించాడు. కేన్ నీ బ్యాటింగ్ సిల్క్స్ సూపర్.. వచ్చే సీజన్‌లో కౌంటర్ అటాక్ బ్యాట్స్‌మన్‌గా తీసుకునేందుకు ప్రయత్నిస్తాం అంటూ లాఫింగ్ ఎమోజీతో తెలిపాడు. చదవండి: ‘ప్రాక్టీస్ వద్దంటే గోల చేసేవాడు.. లెజెండ్ అవుతాడు’
Got a match winning T20 knock in me I reckon. 😂🏏 Any places going for @RCBTweets in the @IPL next season @imVkohli?? pic.twitter.com/tjUZnedVvI
— Harry Kane (@HKane) November 27, 2020
Bit disappointed not to be selected but nothing I can do now. Will still be cheering the boys on 😂🏏🔥 https://t.co/Jq17o1m3aO
— Harry Kane (@HKane) January 20, 2021
Comments
Please login to add a commentAdd a comment