england footballar
-
ఐపీఎల్: రిటైన్ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం
ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి మినీ వేలంకు సిద్ధమవుతున్న 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను భారీగానే వదులుకున్న సంగతి తెలిసిందే. జనవరి 20 (బుధవారం)తో దాదాపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్లతో పాటు రిలీజ్ చేసిన ఆటగాళ్ల ఫైనల్ లిస్టును విడుదల చేశాయి. కాగా ఐపీఎల్ మినీ వేలం ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఫుట్‌బాలర్.. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ హారీ కేన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హారీ కేన్‌కు ఐపీఎల్ అంటే మహా ప్రాణం.. ఇంగ్లీష్ ఫుట్‌బాల్‌ను ఎంతగా ఆస్వాదిస్తాడో ఐపీఎల్‌ను కూడా అంతే సమానంగా ఆదరిస్తాడు.. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్‌లోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). ఆర్సీబీ అంటే హారి కేన్‌కు విపరీతమైన ప్రేమ.. అందునా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట అంటే అతనికి చాలా పిచ్చి. తాజాగా ఆర్సీబీ రిటైన్, రిలీజ్ లిస్ట్ విడుదల చేసిన సందర్భంగా కేన్ ఫన్నీ కామెంట్స్ చేశాడు.చదవండి: 'నట్టూ.. నీకు కెప్టెన్ అయినందుకు గర్విస్తున్నా' 'నన్ను సెలెక్ట్ చేయనందుకు చాలా నిరాశతో ఉన్నా.. రిటైన్ లిస్ట్‌లో నా పేరు లేకపోవడం బాధాకరం కానీ ఇప్పుడు ఏం చేయడానికి లేదు.. ఆర్సీబీపై ఉన్న ఇష్టం మాత్రం చచ్చిపోదు.. జట్టులోని ఆటగాళ్లను ఉత్సాహపరియేందుకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది.' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఈసారి ఆర్సీబీ 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వారిలో స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మెయిన్ అలీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసిన తర్వాత రూ. 35.7 కోట్లతో ఆర్సీబీ వేలానికి సిద్ధమవుతుంది. కాగా ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన తర్వాత హారి కేన్ తన బ్యాటింగ్ స్కిల్‌కు సంబంధించిన వీడియోను కోహ్లి, ఆర్సీబీ హాష్‌ట్యాగ్‌తో షేర్ చేశాడు. మీ టీమ్ తరపున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు నేను సిద్ధం. వచ్చే సీజన్లో అవకాశం ఉంటే నాకు ఒక చాన్స్ ఇవ్వండి .. నేనేంటో చూపిస్తాను అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనిపై కోహ్లి స్పందించాడు. కేన్ నీ బ్యాటింగ్ సిల్క్స్ సూపర్.. వచ్చే సీజన్లో కౌంటర్ అటాక్ బ్యాట్స్‌మన్‌గా తీసుకునేందుకు ప్రయత్నిస్తాం అంటూ లాఫింగ్ ఎమోజీతో తెలిపాడు. చదవండి: ‘ప్రాక్టీస్ వద్దంటే గోల చేసేవాడు.. లెజెండ్ అవుతాడు’ Got a match winning T20 knock in me I reckon. 😂🏏 Any places going for @RCBTweets in the @IPL next season @imVkohli?? pic.twitter.com/tjUZnedVvI — Harry Kane (@HKane) November 27, 2020 Bit disappointed not to be selected but nothing I can do now. Will still be cheering the boys on 😂🏏🔥 https://t.co/Jq17o1m3aO — Harry Kane (@HKane) January 20, 2021 -
తండ్రి అడుగుజాడల్లో తనయుడు
మాంచెస్టర్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ వేన్ రూనీ అడుగుజాడల్లోనే తన కుమారుడు పయనిస్తున్నాడు. 11 ఏళ్ల కాయ్ రూనీ ప్రతిష్టాత్మక మాంచెస్టర్ యునైటెడ్ అకాడమీలో చేరేందుకు సంతకం చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 2003 నుంచి 2017 వరకు ఆడి రికార్డుస్థాయిలో 183 గోల్స్ చేసిన 35 ఏళ్ల రూనీ తన పుత్రోత్సాహాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘నేను గర్వపడే రోజు ఇది. నా కుమారుడు కాయ్ మాంచెస్టర్‌తో జతకట్టాడు. కాయ్ నువు చాలా కష్టపడాలి. మరెంతో ఎదగాలి. ఆల్ ది బెస్ట్’ అని ఇంగ్లండ్ తరఫున 120 మ్యాచ్‌లు ఆడి 53 గోల్స్ చేసిన రూనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రూనీ భార్య, కాయ్ తల్లి కొలీన్ కూడా తన సంతోషాన్ని వెలిబుచ్చింది. ‘ఇది మాకెంతో ప్రత్యేకం. అభినందనలు కాయ్. అత్యుత్తమంగా రాణించేందుకు కృషి చేయాలి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. రూనీ–కొలీన్ దంపతులకు నలుగురు కుమారులు కాగా... కాయ్ అందరికంటే పెద్దవాడు. -
'నేను చాలా పెద్ద తప్పు చేశాను'
లండన్: జీవితంలో తాను చాలా పెద్ద తప్పు చేశానని వాపోతున్నాడు ఇంగ్లండ్ ఫుట్‌బాలర్ ఆడం జాన్సన్. లైంగిక వేధింపుల కేసులో పీకల్లోతు మునిగిపోయిన ఈ వికృత ఆటగాడు తాను చేసిన తప్పులను తొలిసారి బహిరంగంగా అంగీకరించాడు. అయితే తన లైంగిక అకృత్యాల కారణంగా జైలుపాలు అవుతానని తాను ఎప్పుడూ భావించలేదని చెప్పుకొచ్చాడు. సండర్లాండ్ జట్టుతోపాటు ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ స్టార్ ఆటగాడు మైనర్ బాలికతో లైంగిక చర్యలకు పాల్పడిన కేసులో దోషిగా తేలాడు. ఈ కేసులో త్వరలో శిక్ష ఎదుర్కొనున్న జాన్సన్ ఊహించనిరీతిలో తన జీవితం పతనమైందని, ఇంక తానెప్పుడు ఫుట్‌బాల్ ఆడకపోవచ్చునని ఆవేదన వ్యక్త పరిచాడు. తన జైలుశిక్ష సాధ్యమైనంత తొందరగా పూర్తయితే తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పుకొచ్చాడు. 'ఇది నా స్వయంకృతాపరాధమే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇదంతా గతమైపోవాలని ఆశిస్తున్నారు. ఈ గతం గురించి కాకుండా వేరేవాటి గురించి ఆలోచిస్తున్నాను. నా తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను' అని డానిష్ వ్యాపారవేత్త, మోడల్ జూలీ హల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. మైనర్ బాలికల పట్ల అసభ్యమైన శృంగార చేష్టలకు పాల్పడి దుర్మార్గంగా వ్యవహరించిన జాన్సన్‌ను ఇప్పటికే అతని ప్రియురాలు వదిలేసింది. తామిద్దరికి పుట్టిన 13 నెలల బిడ్డను తీసుకొని స్టాసీ ఫ్లౌండర్ జాన్సన్ నుంచి వేరయింది. లైంగిక నేరాల కేసు విచారణ సందర్భంగా ఆద్యంత జాన్సన్ కు అండగా నిలబడిన ఫ్లౌండర్.. అతడు వెల్లడించిన దారుణ నిజాలతో తమ బంధానికి గుడ్‌బై చెప్పింది.