'నేను చాలా పెద్ద తప్పు చేశాను' | Adam Johnson confesses that he made huge mistake and tells of jail shock over his sex crimes | Sakshi
Sakshi News home page

'నేను చాలా పెద్ద తప్పు చేశాను'

Published Sun, Mar 6 2016 11:12 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

'నేను చాలా పెద్ద తప్పు చేశాను' - Sakshi

'నేను చాలా పెద్ద తప్పు చేశాను'

లండన్: జీవితంలో తాను చాలా పెద్ద తప్పు చేశానని వాపోతున్నాడు ఇంగ్లండ్ ఫుట్‌బాలర్ ఆడం జాన్సన్‌. లైంగిక వేధింపుల కేసులో పీకల్లోతు మునిగిపోయిన ఈ వికృత ఆటగాడు తాను చేసిన తప్పులను తొలిసారి బహిరంగంగా అంగీకరించాడు. అయితే తన లైంగిక అకృత్యాల కారణంగా జైలుపాలు అవుతానని తాను ఎప్పుడూ భావించలేదని చెప్పుకొచ్చాడు.
 

సండర్‌లాండ్ జట్టుతోపాటు ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ స్టార్ ఆటగాడు మైనర్ బాలికతో లైంగిక చర్యలకు పాల్పడిన కేసులో దోషిగా తేలాడు. ఈ కేసులో త్వరలో శిక్ష ఎదుర్కొనున్న జాన్సన్‌ ఊహించనిరీతిలో తన జీవితం పతనమైందని, ఇంక తానెప్పుడు ఫుట్‌బాల్‌ ఆడకపోవచ్చునని ఆవేదన వ్యక్త పరిచాడు. తన జైలుశిక్ష సాధ్యమైనంత తొందరగా పూర్తయితే తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పుకొచ్చాడు.

'ఇది నా స్వయంకృతాపరాధమే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇదంతా గతమైపోవాలని ఆశిస్తున్నారు. ఈ గతం గురించి కాకుండా వేరేవాటి గురించి ఆలోచిస్తున్నాను. నా తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను' అని డానిష్ వ్యాపారవేత్త, మోడల్ జూలీ హల్‌తో మాట్లాడుతూ చెప్పాడు.

మైనర్‌ బాలికల పట్ల అసభ్యమైన శృంగార చేష్టలకు పాల్పడి దుర్మార్గంగా వ్యవహరించిన జాన్సన్‌ను ఇప్పటికే అతని ప్రియురాలు వదిలేసింది. తామిద్దరికి పుట్టిన 13 నెలల బిడ్డను తీసుకొని స్టాసీ ఫ్లౌండర్ జాన్సన్‌ నుంచి వేరయింది. లైంగిక నేరాల కేసు విచారణ సందర్భంగా ఆద్యంత జాన్సన్ కు అండగా నిలబడిన ఫ్లౌండర్.. అతడు వెల్లడించిన దారుణ నిజాలతో తమ బంధానికి గుడ్‌బై చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement