వచ్చే ఐపీఎల్ సీజన్ (2025) నుంచి అన్ని ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. నిన్న (జులై 31) జరిగిన బీసీసీఐ-ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల సమావేశంలో ఈ అంశంపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల జాబితాపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ప్రతి ఫ్రాంచైజీ విదేశీ, స్వదేశీ, క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ల పేర్లతో కూడిన జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీల వారీగా రిటైన్ చేసుకోయే ఆటగాళ్ల జాబితాలో ఇలా ఉండబోతుందంటూ నెట్టింట పలు జాబితాలు స్క్రోల్ అవుతున్నాయి.
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, విల్ జాక్స్, మొహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లొమ్రార్
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, రోవ్‌మన్ పావెల్
కేకేఆర్: సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, మిచెల్ స్టార్క్
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్ స్టబ్స్
పంజాబ్ కింగ్స్: సామ్ కర్రన్, అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, జానీ రిలీ రొస్సో, నాథన్ ఇల్లిస్
సన్‌రైజర్స్ హైదరాబాద్: భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని, శివమ్ దూబే, మతీశ పతిరణ, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్
లక్నో సూపర్ జెయింట్స్: మయాంక్ యాదవ్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్, స్పెన్సర్ జాన్సన్
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కొయెట్జీ
Comments
Please login to add a commentAdd a comment