
ఐపీఎల్ 2023కి ముందే టోర్నీలో పాల్గొనే పది జట్లు తమ ఆటగాళ్లకు సంబంధించిన రిటైన్, రిలీజ్ జాబితాను ప్రకటించేశాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఇక వేలంలో పాల్గొనబోయే ఫ్రాంజైజీలు ఆటగాళ్లను వదులుకున్న తర్వాత అందుబాటులో ఉన్న మొత్తాన్ని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రిలీజ్ చేసినట్లు వార్తలు రావడం సంచలనం కలిగించింది.
టి20 క్రికెట్‌లో అశ్విన్ అంతగా మెరవకపోయినప్పటికి ఐపీఎల్‌లో మాత్రం అతనికి మంచి రికార్డే ఉంది. పైగా గతేడాది ఐపీఎల్‌లో అతను బౌలింగ్ పరంగా మంచి ప్రదర్శనే కనబరిచాడు. జట్టుకు అతని సేవలు అవసరమున్న దశలో జట్టు నుంచి రిలీజ్ చేయడమేంటని అభిమానులు కామెంట్ చేశారు. కానీ రాజస్తాన్ రాయల్స్ ఈ వార్తలను ఖండిస్తూ అసలు అశ్విన్‌ను రిలీజ్ చేయలేదని ట్విటర్ వేదికగా ప్రకటించింది. రాజస్తాన్ రిటైన్ చేసుకున్న జాబితాలో అశ్విన్ పేరు కూడా ఉంది. అశ్విన్‌ను ట్రోల్ చేస్తూ కామెంట్ చేసిన వారిని ఉద్దేశించి రాజస్తాన్.. ''నిజంగా ఇంతలా ఆలోచించారా'' అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్ తమ రిటైన్ ఆటగాళ్ల లిస్ట్‌ను ప్రకటించింది.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.5 కోట్లు పెట్టి అశ్విన్‌ను కొనుగోలు చేసింది. అప్పట్లో అశ్విన్ కోసం ఢిల్లీ కాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ 2022 ఫిబ్రవరి వేలంపాటలో పోటీ పడ్డాయి. చివరకు అశ్విన్ విషయంలో రాజస్థాన్ పైచేయి సాధించింది. ఇక అశ్విన్ ఐపీఎల్ 2022లో.. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 12 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లోనూ పరవాలేదనిపించాడు. బ్యాటింగ్‌లో 12 ఇన్నింగ్స్‌లు ఆడిన అశ్విన్ 27.29 యావరేజ్‌తో 191 పరుగులు చేశాడు.
రాజస్తాన్ రిటైన్ లిస్ట్
సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్
రాజస్తాన్ విడిచిపెట్టిన జాబితా
అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, , శురాస్సీ వాన్ డెర్ డస్సెన్భమ్ గర్వాల్, తేజస్ బరోకా
Did you 𝘳𝘦𝘢𝘭𝘭𝘺 think?! 🤦♂️#iplretentions pic.twitter.com/2zFf9Zvlrv
— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2022
Comments
Please login to add a commentAdd a comment