
ఐపీఎల్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్స్ అందుతున్నాయి. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగనున్నట్లు తెలుస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ముగ్గురు అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్ టు మ్యాచ్ (RTM) ద్వారా ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో ఆటగాడిని దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే సీజన్ నుంచి ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ కూడా పెరుగనుందని సమాచారం.
మెగా వేలం ఐదేళ్లకు ఒకసారి జరగనున్నట్లు తెలుస్తుంది. ఇవాళ (జులై 31) జరిగే బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్ల సమావేశంలో ఈ అంశాలపై క్లారిటీ రావచ్చు. కాగా, ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఈ ఏడాది చివర్లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు అన్ని ఫ్రాంచైజీలకు నలుగురు ఆటగాళ్లను మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. ఈ సంఖ్య పెంపుపై ఫ్రాంచైజీలు ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment