ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను (ముగ్గురు దేశీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు) రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎమ్) కార్డుకు బీసీసీఐ ఒప్పుకోలేదని తెలుస్తోంది. బుధవారం బెంగళూరులో జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాలన్ని ఫైనలైజ్ అయినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.
రైట్ టు మ్యాచ్ కార్డ్(ఆర్టీఎమ్) అంటే.. ఏదైనా ఫ్రాంచైజీ వేలంలో తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్టీఎమ్ కార్డు ద్వారా ఆ ధరను సదరు ప్రాంచైజీకి చెల్లించి ఆటగాడిని తిరిగి తీసుకోవచ్చు. 2018 ఐపీఎల్ మెగా వేలంలో ఆర్టీఎమ్ కార్డ్‌ను చివరిసారిగా ఉపయోగించారు. ఆ తర్వాత బీసీసీఐ ఆర్టీఎమ్ కార్డ్ రూల్‌ను తొలగించింది. రానున్న మెగా వేలం తిరిగి ఈ రూల్‌ను ప్రవేశపెట్టాలని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే బీసీసీఐ ఇందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేయగా.. దీనికి కూడా బీసీసీఐ నో చెప్పినట్లు సమాచారం. అంతిమంగా ఐదు రిటెన్షన్స్, నో ఆర్టీఎమ్, మెగా వేలానికి బీసీసీఐ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం జరిగే అవకాశం ఉంది.
చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. రెండేళ్ల కరువును తీర్చుకున్న చండీమల్
Comments
Please login to add a commentAdd a comment