ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేశారు. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో పలువురు జాక్‌పాట్ కొట్టారు. బేస్ ధర నుంచి ఏకంగా కోట్లకు పడగలెత్తారు.
రిటెన్షన్స్‌లో అందరి కంటే ఎక్కువ లబ్ది పొందింది రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధృవ్ జురెల్. ఈ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌ను రాయల్స్ 20 లక్షల నుంచి 14 కోట్లకు సొంతం చేసుకుంది. జురెల్ తర్వాత సీఎస్‌కే పతిరణ, కేకేఆర్ రింకూ సింగ్ అత్యధికంగా లబ్ది పొందారు.
పతిరణ 20 లక్షల నుంచి 13 కోట్లకు.. రింకూ సింగ్ 55 లక్షల నుంచి 13 కోట్లకు రిటైన్ చేసుకోబడ్డారు. వీరి తర్వాత రజత్ పాటిదార్, మయాంక్ యాదవ్ 20 లక్షల బేస్ ధర నుంచి 11 కోట్లకు రిటైన్ చేసుకోబడ్డారు.
ఓవరాల్‌గా చూస్తే రిటెన్షన్స్ అనంతరం అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడిగా హెన్రిచ్ క్లాసెన్ నిలిచాడు. క్లాసెన్‌కు గత సీజన్ శాలరీ 5.25 కోట్లు కాగా.. ఎస్‌ఆర్‌హెచ్ ఈసారి అతన్ని ఏకంగా 23 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే క్లాసెన్ శాలరీ ఏకంగా 17.75 కోట్లు పెరిగింది.
రిటెన్షన్స్‌లో అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాళ్లు వీరే..!
హెన్రిచ్ క్లాసెన్ 5.25 కోట్ల నుంచి 23 కోట్లు
ధృవ్ జురెల్ 20 లక్షల నుంచి 14 కోట్లు
మతిశ పతిరణ 20 లక్షల నుంచి 13 కోట్లు
రింకూ సింగ్ 55 లక్షల నుంచి 13 కోట్లు
రజత్ పాటిదార్ 20 లక్షల నుంచి 11 కోట్లు
మయాంక్ యాదవ్ 20 లక్షల నుంచి 11 కోట్లు
సాయి సుదర్శన్ 20 లక్షలు నుంచి 8.5 కోట్లు
నితీశ్ కుమార్ రెడ్డి 20 లక్షల నుంచి 6 కోట్లు
శశాంక్ సింగ్ 20 లక్షల నుంచి 5.5 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment