దేశవాళీ క్రికెట్లో పాల్గొనటం ద్వారా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చని టీమిండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు ఈ టోర్నీల్లో ఆడటం వల్ల యువతలో స్ఫూర్తినింపినట్లు అవుతుందని పేర్కొన్నారు.
కాగా జాతీయ విధుల నుంచి విరామం లభించినపుడు.. ఫిట్‌గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీ-2024లో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు పాల్గొనున్నారు.
ఇండియా-ఏ, ఇండియా-బి- ఇండియా-సి, ఇండియా-డి జట్ల తరఫున ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఈ రెడ్‌బాల్ టోర్నీ పోటీలు అనంతపురం వేదికగా గురువారం ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రికెటర్లంతా అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.
ఈ క్రమంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అనంతపురం లో జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోర్-డే టోర్నీలో ఆడటం ద్వారా నైపుణ్యాలను పదునుపెట్టుకునే అవకాశం దొరుకుతుందని హర్షం వ్యక్తం చేశారు.
దులిప్ ట్రోఫీ- 2024 జట్లు
ఇండియా-ఏ
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.
ఇండియా-బి
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).
ఇండియా-సి
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.
ఇండియా-డి
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment