ఐపీఎల్‌లో అనంతపురం యువకుడికి బంపర్ ఆఫర్! | APL Player KH Veera Reddy Received Call From IPL Mumbai Indians And Rajasthan Royals To Represent In Their Team - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో అనంతపురం యువకుడికి బంపర్ ఆఫర్!

Published Wed, Sep 20 2023 2:12 AM | Last Updated on Wed, Sep 20 2023 5:43 PM

- - Sakshi

అనంతపురం: జిల్లాకు చెందిన వర్ధమాన క్రికెటర్‌ కేహెచ్‌ వీరారెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)లో అత్యుత్తమ ప్రదర్శనతో రాయలసీమ కింగ్స్‌ జట్టు విజయానికి కారణమైన వీరారెడ్డి.. ఆ టోర్నీలో ఎమర్జింగ్‌ ప్లేయర్‌గా అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సైతం నెలకొల్పిన ఆయన ఆటతీరుపై ప్రశంసలూ వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే తమ జట్టులో ప్రాతినిథ్యం వహించాలంటూ ముంబయి ఇండియన్స్‌తో పాటు రాజస్తాన్‌ రాయల్స్‌ నుంచి ఆయనకు పిలుపు అందింది. అయితే నాగపూర్‌లో జరిగే మూడు రోజుల శిక్షణకు హాజరు కావాలన్న రాజస్తాన్‌ రాయల్స్‌ పిలుపుపైనే వీరారెడ్డి మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. ఈ అవకాశం దక్కితే అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన తొలి క్రికెటర్‌గా ఆయన ఖ్యాతి గడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement