Rajasthan Royals cricketers
-
IPL 2024: రాయల్స్ రాజసం ముందు గుజరాత్ నిలబడేనా..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 10) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా అపజయం ఎరుగని రాజస్థాన్ రాయల్స్‌ను అరకొర విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. రాయల్స్ సొంత మైదానమైన సువాయ్ మాన్సింగ్ స్టేడయంలో (జైపూర్) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్లో రాయల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులు.. ఐపీఎల్లో రాజస్థాన్, గుజరాత్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ అత్యధికంగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాయల్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. తుది జట్లు (అంచనా).. నేటి మ్యాచ్ కోసం రాజస్థాన్ మార్పులేమీ చేయకపోవచ్చు. ఆర్సీబీతో గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు సైతం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నండ్రే బర్గర్ గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, బీఆర్ శరత్ (వికెట్‌కీపర్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ బలాబలాలు.. ప్రస్తుత సీజన్లో గుజరాత్‌తో పోలిస్తే రాజస్థాన్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా రాయల్స్ బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్దులకు వణుకు పుట్టించేలా ఉంది. యశస్వి ఒక్కడు ఫామ్‌లోకి వస్తే నేటి మ్యాచ్‌లో రాయల్స్‌ను ఆపడం కష్టం. గత మ్యాచ్‌లోనే బట్లర్ మెరుపు శతకం బాది పూర్వపు టచ్‌ను అందుకున్నాడు. సంజూ, రియాన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. హెట్‌మైర్, ద్రువ్ జురెల్ నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ బాకీ ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ రాయల్స్ తిరుగులేని శాక్తిగా ఉంది. బౌల్ట్, బర్గర్, ఆవేశ్ ఖాన్, అశ్విన్, చహల్, రియాన పరాగ్‌లతో ఆ జట్టు పేస్, స్పిన్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు బౌలింగ్ విభాగం ఓ మోస్తరుగా ఉన్నా, బ్యాటింగ్‌లో మాత్రం చాలా వీక్‌గా కనిపిస్తుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మత్రమే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా ఆడారు. మిల్లర్ గాయపడటంతో గుజరాత్ కష్టాలు ఎక్కువయ్యాయి. అతని స్థానంలో తుది జట్టులో వచ్చిన కేన్ మామ గత మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయాడు. ఆఖర్లో తెవాటియా పర్వాలేదనిపిస్తుండగా.. విజయ్ శంకర్, బీఆర్ శరత్, దర్శన్ నల్కండే ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నల్కండేలతో గుజరాత్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బ్యాటర్లు చెలరేగితే నేటి మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించగలుగుతుంది. రాయల్స్ రాజసం కొనసాగుతుందో.. గుజరాత్ గర్జిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి ఉండాల్సిందే. -
ఐపీఎల్లో అనంతపురం యువకుడికి బంపర్ ఆఫర్!
అనంతపురం: జిల్లాకు చెందిన వర్ధమాన క్రికెటర్ కేహెచ్ వీరారెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో అత్యుత్తమ ప్రదర్శనతో రాయలసీమ కింగ్స్ జట్టు విజయానికి కారణమైన వీరారెడ్డి.. ఆ టోర్నీలో ఎమర్జింగ్ ప్లేయర్‌గా అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సైతం నెలకొల్పిన ఆయన ఆటతీరుపై ప్రశంసలూ వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తమ జట్టులో ప్రాతినిథ్యం వహించాలంటూ ముంబయి ఇండియన్స్‌తో పాటు రాజస్తాన్ రాయల్స్ నుంచి ఆయనకు పిలుపు అందింది. అయితే నాగపూర్‌లో జరిగే మూడు రోజుల శిక్షణకు హాజరు కావాలన్న రాజస్తాన్ రాయల్స్ పిలుపుపైనే వీరారెడ్డి మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. ఈ అవకాశం దక్కితే అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన తొలి క్రికెటర్‌గా ఆయన ఖ్యాతి గడించనున్నారు. -
అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
ఐపీఎల్ 1000వ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఐపీఎల్-2023లో భాగంగా వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రశాంతతను కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్‌తో రోహిత్ వాగ్వాదానికి దిగాడు. ఏం జరిగిందంటే? రాజస్తాన్ ఇన్నింగ్స్ 20 ఓవర్లో అర్షద్ ఖాన్ వేసిన ఫుల్ టాస్ బంతిని యశస్వి జైశ్వాల్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి పిచ్ మధ్యలో గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బౌలర్ అర్షద్ ఖాన్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి బ్యాటర్‌కు కొంచెం ఎత్తుగా వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్లు అది ఏమైనా నో బాలా అన్న డౌట్‌తో థర్డ్ అంపైర్‌ను సంప్రదించారు. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయడం రోహిత్ శర్మకు చిరాకు తెప్పించింది. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్లో ఆటగాళ్లు వైడ్, నో బాల్ నిర్ణయాలను సమీక్షించుకునే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ అంపైర్ రిఫర్ చేయడంతో హిట్‌మ్యాన్ కోపంతో ఊగిపోయాడు. అంపైర్ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఆఖరికి థర్డ్ అంపైర్ కూడా ఔట్‌గా ప్రకటించాడు. దీంతో రోహిత్ కాస్త కూలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా జైశ్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు. చదవండి: IPL 2023: వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. అతడొక అద్భుతం: సంజూ శాంసన్ pic.twitter.com/ba5NY4e74P — IPLT20 Fan (@FanIplt20) April 30, 2023 Tim David, take a bow 🔥 What a way to leave Wankhede and Sachin Tendulkar all smiles 😀#IPL2023 #TATAIPL #MIvRR #IPL1000 | @mipaltan @timdavid8 pic.twitter.com/evvQRJCEFu — JioCinema (@JioCinema) April 30, 2023 -
స్పాట్ ఫిక్సింగ్ ‘త్రయానికి’ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన రాజస్తాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లు నిర్దోషులని జూలై 25న ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు. దీంతో ఈ ముగ్గురు క్రికెటర్లతో పాటు కేసుకు సంబంధం ఉన్న మరో 33 మందికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 16లోగా తమ స్పందనను తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. అలాగే ట్రయల్ కోర్టు రికార్డులను కూడా సమర్పించాలని జస్టిస్ సిద్ధార్థ్ మ్రిదుల్ ఆదేశించారు. క్రికెటర్లపై పెట్టిన కేసులకు సంబంధించి సరైన ఆధారాలను ఢిల్లీ పోలీసులు సమర్పించలేకపోయారని వ్యాఖ్యానించిన కోర్టు వాళ్లను నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదని హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ‘మోకా’ (మహారాష్ట్ర వ్యవస్తీకృత నేరాల చట్టం) చట్టాన్ని కూడా పొరపాటుగా అన్వయించుకున్నారని ఆరోపించారు.