న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన రాజస్తాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లు నిర్దోషులని జూలై 25న ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు. దీంతో ఈ ముగ్గురు క్రికెటర్లతో పాటు కేసుకు సంబంధం ఉన్న మరో 33 మందికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 16లోగా తమ స్పందనను తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
అలాగే ట్రయల్ కోర్టు రికార్డులను కూడా సమర్పించాలని జస్టిస్ సిద్ధార్థ్ మ్రిదుల్ ఆదేశించారు. క్రికెటర్లపై పెట్టిన కేసులకు సంబంధించి సరైన ఆధారాలను ఢిల్లీ పోలీసులు సమర్పించలేకపోయారని వ్యాఖ్యానించిన కోర్టు వాళ్లను నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదని హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్‌లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ‘మోకా’ (మహారాష్ట్ర వ్యవస్తీకృత నేరాల చట్టం) చట్టాన్ని కూడా పొరపాటుగా అన్వయించుకున్నారని ఆరోపించారు.
స్పాట్ ఫిక్సింగ్ ‘త్రయానికి’ హైకోర్టు నోటీసులు
Published Thu, Nov 19 2015 1:35 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement