న్యూఢిల్లీ : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నిందితులను ఆధారాలు లేవనే కారణంతో ట్రయల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంపై ఢిల్లీ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్ సహా 36 మంది జూలై 24న ఈ కేసు నుంచి విముక్తులైన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ హైకోర్టులో పోలీసులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌లో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ 38 అంశాలను పేర్కొన్నారు. మోకా చట్టాన్ని కోర్టు తప్పుగా అర్థం చేసుకుందని, పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే తీర్పునిచ్చిందని తెలిపారు.