న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళా లాయర్‌తోపాటు మరికొందరిపై భౌతిక దాడికి దిగిన ఇద్దరు న్యాయవాదులపై తగిన సాక్ష్యాధారాలున్నాయని సోమవారం హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై ఇంతకుముందు సదరు నిందితులకు షోకాజ్ నోటీసులు జారీచేసిన కోర్టు సోమవారం కోర్టు ధిక్కార నోటీసులను జారీచేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 12న చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. కేసు వివరాలిలా ఉన్నాయి. తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో గత మే 23వ తేదీన వరుణ్ జైన్, చంద్ర ప్రకాశ్ గౌతమ్ అనే ఇద్దరు న్యాయవాదులు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఒక మహిళా న్యాయవాదితోపాటు కొందరు వ్యక్తులపై భౌతిక దాడికి దిగారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి విచారణ జరిపారు. కాగా, కోర్టు ప్రాంగణంలో జరిగిన విషయాన్ని ఒక వ్యక్తి తీసిన ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనంతరం నిందితులిద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. కాగా, వారిద్దరూ తర్వాత జరిగిన గుర్తింపు పెరేడ్‌కు హాజరయ్యేందుకు నిరాకరించారు. దీంతో వారికి కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. గుర్తింపు పెరేడ్‌కు హాజరయ్యేందుకు నిరాకరించినందున వారిపై ఎందుకు కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని అందులో పేర్కొంది.
లాయర్లకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయి..
Published Mon, Aug 11 2014 11:16 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement