న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు మరో మలుపు తిరిగింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
2013 ఐపీఎల్ సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, చండీలా, చవాన్లను ఇటీవల ఢిల్లీ ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో మలుపు
Published Wed, Nov 18 2015 1:19 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement