ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 10) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అపజయం ఎరుగని రాజస్థాన్ రాయల్స్‌ను అరకొర విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. రాయల్స్ సొంత మైదానమైన సువాయ్ మాన్‌సింగ్ స్టేడయంలో (జైపూర్) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్‌లో రాయల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు..
ఐపీఎల్‌లో రాజస్థాన్, గుజరాత్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ అత్యధికంగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాయల్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలుపొందింది.
తుది జట్లు (అంచనా)..
నేటి మ్యాచ్ కోసం రాజస్థాన్ మార్పులేమీ చేయకపోవచ్చు. ఆర్సీబీతో గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు సైతం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నండ్రే బర్గర్
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, బీఆర్ శరత్ (వికెట్‌కీపర్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
బలాబలాలు..
ప్రస్తుత సీజన్‌లో గుజరాత్‌తో పోలిస్తే రాజస్థాన్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా రాయల్స్ బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్దులకు వణుకు పుట్టించేలా ఉంది. యశస్వి ఒక్కడు ఫామ్‌లోకి వస్తే నేటి మ్యాచ్‌లో రాయల్స్‌ను ఆపడం కష్టం. గత మ్యాచ్‌లోనే బట్లర్ మెరుపు శతకం బాది పూర్వపు టచ్‌ను అందుకున్నాడు. సంజూ, రియాన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. హెట్‌మైర్, ద్రువ్ జురెల్ నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ బాకీ ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ రాయల్స్ తిరుగులేని శాక్తిగా ఉంది. బౌల్ట్, బర్గర్, ఆవేశ్ ఖాన్, అశ్విన్, చహల్, రియాన పరాగ్‌లతో ఆ జట్టు పేస్, స్పిన్ విభాగాల్లో పటిష్టంగా ఉంది.
గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు బౌలింగ్ విభాగం ఓ మోస్తరుగా ఉన్నా, బ్యాటింగ్‌లో మాత్రం చాలా వీక్‌గా కనిపిస్తుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మత్రమే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా ఆడారు. మిల్లర్ గాయపడటంతో గుజరాత్ కష్టాలు ఎక్కువయ్యాయి. అతని స్థానంలో తుది జట్టులో వచ్చిన కేన్ మామ గత మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయాడు.
ఆఖర్లో తెవాటియా పర్వాలేదనిపిస్తుండగా.. విజయ్ శంకర్, బీఆర్ శరత్, దర్శన్ నల్కండే ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నల్కండేలతో గుజరాత్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బ్యాటర్లు చెలరేగితే నేటి మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించగలుగుతుంది. రాయల్స్ రాజసం కొనసాగుతుందో.. గుజరాత్ గర్జిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి ఉండాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment