DT 2024: శ్రేయ‌స్ నీవు ఇక మారవా? మ‌ళ్లీ డ‌కౌట్‌ | Duleep Trophy: Shreyas Iyer fails again | Sakshi
Sakshi News home page

DT 2024: శ్రేయ‌స్ నీవు ఇక మారవా? మ‌ళ్లీ డ‌కౌట్‌

Published Fri, Sep 20 2024 9:24 AM | Last Updated on Fri, Sep 20 2024 10:12 AM

Duleep Trophy: Shreyas Iyer fails again

దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయస్‌ అయ్యర్ త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా అనంత‌పూర్ వేదిక‌గా ఇండియా-బితో జ‌రుగుతున్న మ్యాచ్‌లో.. భారత్‌ ‘డి’ కెప్టెన్‌గా బరిలోకి దిగిన అయ్య‌ర్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు.

ఐదు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.  స్పిన్న‌ర్ రాహుల్ చాహ‌ర్ బౌలింగ్‌లో నితీష్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయ‌స్ పెవిలియ‌న్‌కు చేరాడు. ఈ   టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో శ్రేయస్‌ ఒక్కసారి మాత్రమే అర్ధ శతకం సాధించాడు. 

ఓవరాల్‌గా 5 ఇన్నింగ్స్‌లో 20.80 స‌గ‌టుతో కేవ‌లం 105 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో భారత టెస్టు జట్టులో అయ్య‌ర్ రీఎంట్రీ ఇవ్వ‌డం ఇప్ప‌టిలో క‌ష్ట‌మ‌నే చెప్పుకోవాలి. ఈ క్ర‌మంలో శ్రేయ‌స్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. శ్రేయ‌స్ నీవు ఇక మారవా? అంటూ పోస్టులు పెడుతున్నారు.

చెల‌రేగిన సంజూ..
ఇక తొలి రోజు ఆట‌ముగిసే స‌మయానికి భారత్‌ ‘డి’ జట్టు 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. భార‌త‌-డి ఇన్నింగ్స్‌లో అయ్యర్ మిన‌హా మిగితా బ్యాట‌ర్లందరూ త‌మ వంతు పాత్ర పోషించారు. 

శ్రీకర్‌ భరత్‌ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్‌ (87 బంతుల్లో 56;9 ఫోర్లు), దేవదత్‌ పడిక్కల్‌ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. అదే విధంగా వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ 89 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు.
చదవండి: AUS vs ENG: హెడ్‌ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement