ముందే గెలిస్తే బాగుండేది.. అయిపోయిందిగా | Fans Troll After NZ Knock Out Team India From T20 World Cup 2021 | Sakshi
Sakshi News home page

Team India: ముందే గెలిస్తే బాగుండేది.. అయిపోయిందిగా

Published Sun, Nov 7 2021 8:04 PM | Last Updated on Sun, Nov 7 2021 8:54 PM

Fans Troll After NZ Knock Out Team India From T20 World Cup 2021 - Sakshi

Fans Troll Team India After Knock Out From T20 WC 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా పోరాటం అనధికారికంగా ముగిసినట్లే. ఆదివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.  ఇక సోమవారం(నవంబర్‌ 7న) నమీబియాతో జరిగే మ్యాచ్‌ టీమిండియాకు నామమాత్రంగా మారింది. అయితే టీమిండియా ఇంటిదారి పట్టడం అభిమానులకు బాధ కలిగిస్తుంది. దీంతో టీమిండియాపై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేశారు.

చదవండి: AFG Vs NZ: చేతులెత్తేసిన అఫ్గాన్‌.. టీమిండియా ఇంటికి

''అఫ్గాన్‌తో మ్యాచ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా టీమిండియా న్యూజిలాండ్, పాకిస్తాన్‌లపై విజయం సాధించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు..  ముందే గెలిస్తే బాగుండేది.. అయిపోయిందిగా.. అఫ్గాన్‌తో పాటు మీరు ఇంటికి వచ్చేస్తున్నారు.. కోహ్లి టి20 ప్రపంచకప్‌ కొట్టకుండానే వెనుదిరగడం బాధ కలిగిస్తుంది.. అసలు మ్యాచ్‌ల్లో చేతులెత్తేసి చిన్న జట్లపై ప్రతాపం చూపించడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు.. '' అంటూ విరుచుకుపడ్డారు. 

టీమిండియా టి20 ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశలో వెనుదిరగడం 2012 తర్వాత ఇదే కావడం విశేషం. ఆ తర్వాత జరిగిన ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా కనీసం సెమీస్‌కు చేరుకుంది.
న్యూజిలాండ్‌ ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు 14 సార్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో 2007, 2016 తర్వాత మూడోసారి న్యూజిలాండ్‌ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement