లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా జరుగుతోంది. 236/4 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(108), బ్లండల్(96) పరుగులతో రాణించారు.అయితే మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌ను స్టువర్ట్ బ్రాడ్ ఆదిలోనే దెబ్బ తీశాడు.
ఇన్నింగ్స్ 84 ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. మూడో బంతికి డార్లీ మిచెల్ ఎల్బీ రూపంలో ఔట్ కాగా, తరువాత బంతికి డి గ్రాండ్‌హోమ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే జేమీసన్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో వరుస క్రమంలో న్యూజిలాండ్ వికెట్ కోల్పోయింది. ఇక ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 276 పరుగులు చేయాలి.
చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. టీ10 చరిత్రలో అరుదైన ఫీట్.. తొలి ఆటగాడిగా..!
OH MY BROAD! 😱
— England Cricket (@englandcricket) June 4, 2022
Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP
🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/tTSvvVAvyp
Comments
Please login to add a commentAdd a comment