ENG vs NZ: అదరగొట్టిన మిచెల్, బ్లన్‌డెల్‌.. ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలే! | ENG vs NZ 1st Test: Daryl Mitchell Blundell Unbeaten Day 2 NZ 227 Runs Lead | Sakshi
Sakshi News home page

ENG vs NZ 1st Test Day 2: అదరగొట్టిన మిచెల్, బ్లన్‌డెల్‌.. ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలే!

Published Sat, Jun 4 2022 7:49 AM | Last Updated on Sat, Jun 4 2022 8:01 AM

ENG vs NZ 1st Test: Daryl Mitchell Blundell Unbeaten Day 2 NZ 227 Runs Lead - Sakshi

ఆదుకున్న మిచెల్, బ్లన్‌డెల్‌(PC: Black Caps)

England Vs New Zealand 1st Test Day 2 Score- లండన్‌: లార్డ్స్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ దాదాపు సమంగా నిలవగా... రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ చక్కటి బ్యాటింగ్‌తో కోలుకుంది. మ్యాచ్‌ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.

డరైల్‌ మిచెల్‌ (97 నాటౌట్‌; 11 ఫోర్లు), టామ్‌ బ్లన్‌డెల్‌ (90 నాటౌట్‌; 12 ఫోర్లు) సెంచరీలకు చేరువయ్యారు. కివీస్‌ ఒకదశలో 56 పరుగులకు 4 వికెట్లు కోల్పోగా... మిచెల్, బ్లన్‌డెల్‌ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 180 పరుగులు జోడించారు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 116/7తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 141 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 9 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్‌ బౌలర్లలో సౌతీ 4, బౌల్ట్‌ 3 వికెట్లు తీశారు.

Day 2: రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 236/4 .

చదవండి: IPL 2022: అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్‌ బాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement