![NZ vs SL 1st Test: Daryl Mitchell, Matt Henry Put Hosts On Top As Sri Lanka Lose 3 Wickets - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/12/MITCHELL.jpg.webp?itok=F1aWab9x)
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ అనూహ్యంగా స్వల్ప ఆధిక్యం అందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 162/5తో ఆట కొనసాగించిన కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 18 పరుగుల ఆధిక్యం దక్కింది. డరైల్ మిచెల్ (193 బంతుల్లో 102; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, మాట్ హెన్రీ (75 బంతుల్లో 72; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.
అసిత ఫెర్నాండో 4 వికెట్లు పడగొట్టగా, లహిరు కుమారకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (20 బ్యాటింగ్), ప్రభాత్ జయసూర్య (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం లంక 65 పరుగులు మాత్రమే ముందంజలో ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికర స్థితికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment