Matt Henry
-
ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్.. అసలు ఆ షాట్ అవసరమా? వీడియో
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేసిన హిట్‌మ్యాన్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ శుభారంభం అందిస్తాడని భావించారు. కానీ రోహిత్ అందరి ఆశలను అడియాశలు చేశాడు. కివీ పేసర్ మాట్ హెన్రీ బౌలింగ్‌లో నిర్లక్ష్యపు షాట్ ఆడి రోహిత్ తన వికెట్‌ను కోల్పోయాడు.ట్రాప్‌లో చిక్కుకున్న హిట్‌మ్యాన్..రోహిత్ శర్మ సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తన ఫేవరేట్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. తొలి ఓవర్ వేసిన మాట్ హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ అద్బుతమైన బౌండరీ కూడా సాధించాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసేందుకు హెన్రీ మళ్లీ ఎటాక్‌లో వచ్చాడు. అయితే సరిగ్గా ఇదే సమయంలో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ తన కెప్టెన్సీ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. లాథమ్ లాంగ్ ఆన్, మిడ్-ఆన్ మధ్యలో ఫీల్డర్‌ను ఉంచి రోహిత్‌కు పుల్ షాట్ ఆడేందుకు అవకాశమిచ్చాడు.ఈ నేపథ్యంలో మూడో ఓవర్ ఆఖరి బంతిని హెన్రీ బ్యాక్ఆఫ్ది లెంగ్త్ బాల్‌గా హిట్‌మ్యాన్‌కు సంధించాడు. దీంతో ఆ బంతిని రోహిత్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది.దీంతో మిడ్-వికెట్లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆ షాట్ ఆడాల్సిన అవసరం ఏముందని పోస్టులు పెడుతున్నారు.ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 12 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(23), జడేజా(5) ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి. pic.twitter.com/TumJQ3gaS1— viratgoback (@viratgoback) November 3, 2024 -
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 4) ప్రకటించింది. పురుషుల క్రికెట్లో ఈ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ పోటీపడనున్నారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ ఈ అవార్డు రేసులో ఉన్నారు. మార్క్ అదైర్: మార్చి నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆల్ ఫార్మాట్ సిరీస్‌లలో అదైర్ అద్భుతంగా రాణించాడు. తొలుత జరిగిన ఏకైక టెస్ట్‌లో 8 వికెట్లతో అదరగొట్టిన అదైర్.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో 3 వికెట్లు, టీ20 సిరీస్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. కమిందు మెండిస్: ఈ శ్రీలంక ఆల్‌రౌండర్ మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాట్ హెన్రీ: మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో హెన్రీ ఆద్భుతంగా రాణించాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 0-2 తేడాతో కోల్పోయినప్పటికీ హెన్రీ 17 వికెట్లతో సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించిన హెన్రీ 25.25 సగటున 101 పరుగులు చేశాడు. ఆష్లే గార్డ్నర్: మార్చి నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గార్డ్నర్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించింది. ఈ సిరీస్‌లో ఆమె 52 పరుగులు సహా ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గార్డ్నర్ రికార్డు స్థాయిలో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకుంది. మైయా బౌచియర్: బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్‌లో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్లో అత్యుత్తమ స్కోర్‌గా నమోదైంది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది. అమేలియా కెర్: మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెర్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో కెర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 114 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టింది. -
లక్నో జట్టులోకి స్టార్ బౌలర్.. ప్రకటించిన ఫ్రాంఛైజీ! ధర?
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన చేసింది. డేవిడ్ విల్లే స్థానాన్ని న్యూజిలాండ్ సీమర్ మ్యాట్ హెన్రీతో భర్తీ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. కాగా ఐపీఎల్-2024 వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లేను లక్నో.. రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా విల్లే.. ఐపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్ మ్యాట్ హెన్రీని జట్టులోకి తీసుకువచ్చింది లక్నో సూపర్ జెయింట్స్. రూ. 1.25 కోట్ల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది. కాగా న్యూజిలాండ్ తరఫున 2014లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మ్యాచ్ హెన్రీ.. ఇప్పటి వరకు 25 టెస్టులు, 82 వన్డేలు, 17 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 95, 141, 20 వికెట్లు తీశాడు. 32 ఏళ్ల హెన్రీ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. గతంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో 131 మ్యాచ్‌లు ఆడిన మ్యాట్ హెన్రీ.. 151 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి రాకతో లక్నో సూపర్ జెయింట్స్ పేస్ దళం పటిష్టం అవుతుందని చెప్పవచ్చు. కాగా లక్నో శనివారం నాటి మ్యాచ్‌లో లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిపాలైంది. రాజస్తాన్ రాయల్స్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అర్ధ శతకం(44 బంతుల్లో 58 రన్స్) వృథాగా పోయింది. చదవండి: వాళ్లిద్దరికి ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం షాకింగ్ కామెంట్ -
NZ vs AUS: చెలరేగిన హాజిల్‌వుడ్.. కుప్పకూలిన కివీస్! కానీ..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కంగారూ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దెబ్బకు కివీస్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో కివీస్ బరిలోకి దిగింది. అయితే, తొలిరోజే ఆసీస్ చేతిలో ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్లంతా కలిసికట్టుగా విఫలం కావడంతో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ టామ్ లాథమ్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో మ్యాట్ హెన్రీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో వికెట కీపర్ టామ్ బ్లండెల్(22), కెప్టెన్ టిమ్ సౌథీ(26) మాత్రమే 20 పరుగుల మార్కు దాటగలిగారు. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు కివీస్ పేసర్ బెన్ సీర్స్. ఓపెనర్ స్టీవ్ స్మిత్(11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తొలి వికెట్ పడగొట్టాడు. అనంతరం మరో ఫాస్ట్‌బౌలర్ మ్యాట్ హెన్రీ ఉస్మాన్ ఖవాజా(16), కామెరాన్ గ్రీన్(25), ట్రవిస్ హెడ్(21)ల రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 45, నాథన్ లియోన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ న్యూజిలాండ్ స్టార్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు వందో టెస్టు కావడం విశేషం. -
వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు భారీ షాక్..
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే 5 ఓవర్లు బౌలింగ్ చేసి మైదానం వీడి వెళ్లాడు. అతడి బౌలింగ్ కోటాను జెమ్మీ నీషమ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హెన్రీ బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు కివీస్ వైద్యబృందం వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడు టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. హెన్రీ స్ధానాన్ని కైల్ జేమీసన్తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. జేమీసన్ ఇప్పటికే జట్టుతో చేరాడు. కాగా ఈ మెగా టోర్నీలో భాగంగా కివీస్ నవంబర్ 4న బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు కూడా కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: WC 2023: కపిల్ దేవ్, ధోనికి సాధ్యం కాలేదు! రోహిత్‌కు కలిసొచ్చింది.. అరుదైన రికార్డు -
CWC 2023: న్యూజిలాండ్ జట్టులో కీలక పరిణామం.. స్టార్ బౌలర్‌కు పిలుపు
ప్రస్తుత ప్రపంచకప్‌లో గాయాలతో సతమతమవుతున్న న్యూజిలాండ్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో గాయపడిన మ్యాట్ హెన్రీకి కవర్ అప్‌గా స్టార్ బౌలర్ కైల్ జేమీసన్‌ను ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఇవాళ సాయంత్రానికంతా జేమీసన్ బెంగళూరుకు చేరుకుంటాడు. ఈ శనివారం పాక్‌తో జరిగే మ్యాచ్ కోసం కివీస్ జట్టు కూడా ఇవాళ బెంగళూరుకు చేరుకుంటుంది. ప్రపంచకప్‌కు ముందు కివీస్ బోర్డు జేమీసన్‌ను టిమ్ సౌథీకి కవర్ అప్‌గా ప్రకటించింది. అయితే సోథీ వేగంగా కోలుకోవడంతో జేమీసన్ స్వదేశంలోనే ఉండిపోయాడు. తాజాగా మ్యాట్ హెన్రీ గాయం బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో న్యూజిలాండ్ బోర్డు జేమీసన్‌ను భారత్‌కు పిలిపించింది. కివీస్ తదుపరి ఆడే మ్యాచ్‌లో హెన్రీ స్థానంలో జేమీసన్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. కాగా, నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా మ్యాట్ హెన్రీ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురై ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. హెన్రీ తదనంతరం జట్టు ఓటమి మార్జిన్‌ను తగ్గించేందుకు బ్యాటింగ్‌కు దిగినప్పటికీ.. గాయం తాలూకా వేదన అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. దీంతో కివీస్ బోర్డు హుటాహుటిన జేమీసన్‌ను భారత్‌కు రావాల్సిందిగా కబురుపెట్టింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నాలుగు వరుస విజయాల తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న న్యూజిలాండ్ ఒక్కసారిగా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్ 1) జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన కివీస్ రన్‌రేట్ పరంగానూ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (114), డస్సెన్ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. కేశవ్ మహారాజ్ (4/46), మార్కో జన్సెన్ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (60), విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడిన న్యూజిలాండ్.. మరో పిడుగు లాంటి వార్త
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నాలుగు వరుస విజయాల తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న న్యూజిలాండ్ ఒక్కసారిగా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్ 1) జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన కివీస్ రన్‌రేట్ పరంగానూ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఇవి చాలవన్నట్లు ఆ జట్టులో గాయాల సమస్య మరింత తీవ్రతరమైంది. సౌతాఫ్రికాతో సందర్భంగా ఆ జట్టు స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురై ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. జట్టు ఓటమి మార్జిన్‌ను తగ్గించేందుకు అతను ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగినప్పటికీ.. గాయం తాలూకా వేదన అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. హెన్రీ గాయం తీవ్రతపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేనప్పటికీ.. అతను కనీసం ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న కివీస్‌కు హెన్రీ గాయం విషయం అస్సలు మింగుడుపడటం లేదు. గాయాల కారణంగా ఇప్పటికే కేన్ విలియమ్సన్, లోకీ ఫెర్గూసన్, మార్క్ చాప్మన్ సేవలు కోల్పోయిన కివీస్.. తాజాగా మ్యాట్ హెన్రీ సేవలు కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. సెమీస్ రేసులో నిలవాలంటే కివీస్ మున్ముందు అత్యంత కీలకమైన మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయాల బారిన పడుతుండటం ఆ జట్టుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సౌతాఫ్రికా మ్యాచ్ సందర్భంగా హెన్రీతో పాటు జిమ్మీ నీషమ్ కూడా గాయపడినట్లు సమాచారం. నీషమ్ కుడి చేతి మణికట్టుకు గాయమైనట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమై, అతను తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోతే కివీస్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (114), డస్సెన్ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. కేశవ్ మహారాజ్ (4/46), మార్కో జన్సెన్ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
NZ vs SL 1st Test: డరైల్ మిచెల్ సెంచరీ
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ అనూహ్యంగా స్వల్ప ఆధిక్యం అందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 162/5తో ఆట కొనసాగించిన కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 18 పరుగుల ఆధిక్యం దక్కింది. డరైల్ మిచెల్ (193 బంతుల్లో 102; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, మాట్ హెన్రీ (75 బంతుల్లో 72; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. అసిత ఫెర్నాండో 4 వికెట్లు పడగొట్టగా, లహిరు కుమారకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (20 బ్యాటింగ్), ప్రభాత్ జయసూర్య (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం లంక 65 పరుగులు మాత్రమే ముందంజలో ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికర స్థితికి చేరింది. -
Pak Vs NZ: మెరిసిన హెన్రీ, ఎజాజ్.. కివీస్ భారీ స్కోరు
Pakistan vs New Zealand, 2nd Test- కరాచీ: టెయిలెండర్లు మ్యాట్ హెన్రీ (68 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎజాజ్ పటేల్ (35; 4 ఫోర్లు) అసాధారణ పోరాటంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓవర్‌నైట్ స్కోరు 309/6తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ 449 స్కోరు వద్ద ఆలౌటైంది. 345/9 స్కోరు వద్ద కివీస్ పతనం అంచున నిలిచింది. ఈ దశలో హెన్రీ, ఎజాజ్ ఆఖరి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఇమామ్ (74 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్), షకీల్ (13 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. కాగా.. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో పై చేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. చదవండి: IND vs SL: అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్ అందించడానికా సెలక్ట్ చేశారు? IPL 2023: ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్’ దూరం?! Abrar Ahmed finally ends the 10th-wicket stand. New Zealand are all out for 449 🏏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/esH89R4AOd — Pakistan Cricket (@TheRealPCB) January 3, 2023 -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన కివీస్! స్టార్ బౌలర్ వచ్చేశాడు!
క్వీన్స్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న చాపెల్-హాడ్లీ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ తమ జట్టును గురువారం ప్రకటించింది. గాయం కారణంగా విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన మాట్ హెన్రీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా విండీస్‌తో అఖరి రెండు వన్డేలకు దూరమైన కెప్టెన్ విలియమ్సన్ కూడా తిరిగి జట్టులోకి చేరాడు. మరోవైపు సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి తప్పుకుంటునట్లు ప్రకటించిన ట్రెంట్ బౌల్ట్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేయడం గమనార్హం. ఈ సిరీస్‌తో 23 ఏళ్ల బెన్ సియర్స్ న్యూజిలాండ్ తరపున వన్డే అరంగేట్రం చేయనున్నాడు. ఈ సిరీస్ కోసం ఏకంగా ఐదు మంది పేస్ బౌలర్లను న్యూజిలాండ్ ఎంపిక చేయడం విశేషం. ఈ నేపథ్యంలో కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బెన్ సియర్స్ని ఈ సిరీస్‌కు ఎంపిక చేశాం. అతడు ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై అద్భుతంగా రాణించగలడన్న నమ్మకం ఉంది. ఇక హెన్రీ కూడా తిరిగి జట్టులోకి రావడం మాకు మరింత బలం చేకూరుతుంది. అతడు గత కొన్నేళ్లగా మా జట్టు ప్రధాన బౌలర్‌గా ఉన్నాడని" పేర్కొన్నాడు. ఇక చాపెల్-హాడ్లీ ట్రోఫీ సెప్టెంబర్ 6 నుంచి జరగనుంది. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ ఫిలిప్స్, మిచెల్ బెన్ సియర్స్, టిమ్ సౌథీ} చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్! భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి.. వీడియో వైరల్!