Pak vs NZ 2nd Test: Henry Powered New Zealand to Score 449 - Sakshi
Sakshi News home page

Pak Vs NZ: మెరిసిన హెన్రీ, ఎజాజ్‌.. కివీస్‌ భారీ స్కోరు

Published Wed, Jan 4 2023 9:50 AM | Last Updated on Wed, Jan 4 2023 10:55 AM

Pak Vs NZ 2nd Test: Henry 68 New Zealand 1st Innings 449 All Out - Sakshi

హెన్రీ అజేయ అర్ధ శతకం (PC: Blackcaps Twitter)

Pakistan vs New Zealand, 2nd Test- కరాచీ: టెయిలెండర్లు మ్యాట్‌ హెన్రీ (68 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎజాజ్‌ పటేల్‌ (35; 4 ఫోర్లు) అసాధారణ పోరాటంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో  ఓవర్‌నైట్‌ స్కోరు 309/6తో మంగళవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌ 449 స్కోరు వద్ద ఆలౌటైంది.

345/9 స్కోరు వద్ద కివీస్‌ పతనం అంచున నిలిచింది. ఈ దశలో హెన్రీ, ఎజాజ్‌ ఆఖరి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన పాకిస్తాన్‌ రెండో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఇమామ్‌ (74 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌), షకీల్‌ (13 బ్యాటింగ్‌; 1 ఫోర్‌) క్రీజులో ఉన్నారు. కాగా.. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో పై చేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
చదవండి: IND vs SL: అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్‌ అందించడానికా సెలక్ట్‌ చేశారు?
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్‌’ దూరం?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement